రెవిన్యూ అధికారుల నిర్లక్ష్యం…అందని పెట్టుబడి సాయం

నేరేడుచర్ల,ఫిబ్రవరి8(నిజం న్యూస్)
అన్నదాతలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం పలుపథకాలు ప్రవేశపెడుతున్నా రెవిన్యూ అధికారుల నిర్లక్ష్యంతో అవి రైతుల దరిచేరడంలేదు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం రెవెన్యూశాఖలో పలుసంస్కరణలు తీసుకువచ్చినా క్షేత్రస్థాయిలో వాటిని అమలుపరిచే యంత్రాంగం ఉదాసీనత అడుగడుగునా కానోస్తోంది.
ఏండ్ల తరబడి మట్టినే నమ్ముకుని భూములు సాగు చేసుకుంటున్న రైతులకు సకాలంలో పట్టాలు ఇవ్వకపోవడంతో రైతుబంధు, రైతుభీమా,పిఎం కిసాన్స్ పెట్టుబడి సాయం అందడంలేదు.
నేరేడుచర్ల మండలంలోని పలుగ్రామాల్లో 40 ఏళ్లకు పైగా భూములు సాగు చేసుకుంటున్న రైతులు పట్టాదారు పాసు పుస్తకాల కోసం ఇప్పటికి కాళ్లు అరిగేలా రెవిన్యూ కార్యలయం చుట్టూతిరుగుతున్నారు.
బడా నాయకులు,పైరవీకారుల ప్రాతినిధ్యాలను మాత్రంగంటల్లో పరిష్కరిస్తున్న యంత్రాంగం, సామాన్య రైతుల సమస్యలను మాత్రం యేళ్లు గడుస్తున్న పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే తప్ప సమస్యపరిష్కార మయ్యేలా లేదు.
నేరేడుచర్ల మండలంలో ఎక్కువ మొత్తం వారి సాగులో ఉన్నట్లువ్యవసాయశాఖ అధికారుల రికార్డుల్లో నమోదైంది. కొత్తపట్టా పాస్ పుస్తకం అందుకున్న రైతులకుమాత్రమే రైతు బంధు చెల్లిస్తున్నట్లు లెక్కలు తెలుపుతున్నాయి.
కానీ రికార్డుల్లోకి వేలాది ఎకరాల భూములు నమోదు కాలేదు.మండలంలోని దాచారం, పత్తేపురం, మేడారం, కల్లూరు, వైకుంఠపురం, పెంచికల్ దిన్న, సోమారం, పెంచికల్ దిన్న, సోమారం ప్రతి గ్రామంలో రైతులు 40 ఏళ్లకుపైగా సాగులో ఉన్న భూములకు కొత్త పాస్ పుస్తకం పట్టాలు మాత్రం అందడం లేదు.
గ్రామంలో రైతులు సాగు చేసుకుంటున్న భూములకు కొత్త పాస్ పుస్తకం ఇవ్వమని ఎన్ని ప్రదక్షిణలు చేసినా రైతు గోడు పట్టించుకున్నపాపనపోలేదు.కాళ్లరిగేలా తిరుగుతూ మండలంలోపట్టాలు అందని రైతులకు పట్టా చేయమంటే ధరణీ లో అర్.యస్.ఆర్ టాలీ కావడంలేదు
. మీభూమి ఎవరి పేరు మీదనో ఎక్కింది చెక్ చేసుకుని రండి లేదా ధరణీ లో అన్ సైన్ ఆప్షన్ రాలేదు వచ్చే వరకు వేచి వుండాలి అని నిర్లక్ష్యపు సమాధానం. ఎప్పుడు వస్తుందో దానికి మేము ఎమీ చెప్పలేము అని రెవెన్యూ అధికారులు చెప్పడంవిస్మయానికి గురిచేస్తోంది.
రైతులు 40 ఏండ్లుగా భూములను సాగు చేసుకుంటున్నా పాసు పుస్తకాలకు దిక్కులేదు. ప్రతి యేటా తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్య కాగితాలకు పరిమితమవుతుందేతప్ప అన్నదాతకు మాత్రం పట్టాలు అందడం లేదు. రైతులు సాగులో ఉన్నప్పటికీ భూములు పట్టాలో ఎక్కనివి మరెన్నో ఉన్నాయి.
గత ప్రభుత్వం జారీ చేసిన పాసు పుస్తకాలు ఉన్నా నేడు కొత్త పట్టాదారు పాసు పుస్తకంను అధికారులు జారీ చేయడం లేదు.రెవెన్యూ శాఖ జారీ చేసిన పట్టాలు అరకోర మాత్రమే. రెవెన్యూ శాఖ లీలతో మూడెకరాలున్న రైతుకు ఎకరం, ఎకరం ఉన్న రైతుకు అరుఎకరాలు, ఎమీలేని రైతులకు ఎకరాల కొద్ది భూము లను తప్పుల
తడుకగా కట్టబెట్టినట్లు ధరణీ రికార్డుల్లో తెటతెల్లం అవుతోంది.
నేరేడు చర్ల మండల రెవిన్యూ రికార్డుల్లో భూమి లేనివారికి ధరణీ లో మాత్రం భూమి వున్నట్లు అన్ లైన్ లోకి ఎక్కించినట్లు రైతులు రెవిన్యూ అధికారుల పై భహిరంగానే విమర్శిస్తున్నారు. ఇరవై ఏళ్ల క్రితం కొన్న భూమినీ ఇప్పుడు మరలా ధరణీ లో అమ్మిన వారి పేరు మీద చూపిస్తున్నది. దీనికీ మొత్తానికి కారణం రెవిన్యూ అధికారుల అసమర్థ వల్లనే ఇంతటి నష్టం, కష్టం రైతులకు వచ్చిందని అధికారులపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి కైన మా భూమిని మాకు ధరణీ లో నమోదు చేసి కొత్త పాస్ పుస్తకం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.మండలంలో సుమారుగా 300 మంది రైతులకు1500వందల ఎకరాలకుపైగాపట్టాలు అందక నష్టపోతున్నారు.
పట్టాలందక సంక్షేమ పథకాలకు రైతులు దూరం అవుతున్నారు.రైతులు సాగులో ఉన్న భూములకు పట్టాలు అందక రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. పట్టాలు లేనిరైతులు ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా చూపడంతో రైతు ఆకారణంగా నష్టపోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 2018 ఖరీఫ్ సీజన్నుంచి ఇప్పటివరకు ఎనిమిది పర్యాయాలుగా రైతు బంధు సాయాన్నిఅందిస్తోంది. రైతు బంధు ఎకరాకు రూ. ఐదు వేలు చెల్లిస్తుండగా, కేంద్రం రెండేళ్లుగా పిఎం కిసాన్ పథకంతో సంవత్సరానికి నాలుగు వేల పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. దీంతోపాటు రైతు భీమా,పంటల నష్టం, ఎరువులు, విత్తనాల కొనుగోళ్లతోపాటు పంటను విక్రయించే క్రమంలో ఇబ్బందులు తప్పడం లేదు.
నూకల మల్లమ్మ w లక్ష్మి నరసింహ రెడ్డీ, పతెపురం, గ్రామం
పాత పాసు పుస్తకమున్నా కొత్త పట్టా ఇవ్వడంలేదు
నాకు 0.36 కుంటల భూమికి పాత పట్టాదారు పాసుపుస్తకంలో నమోదైంది. నేడు ప్రభుత్వం జారీ చేస్తున్న కొత్తపట్టాదారు పాసు పుస్తకం ఇవ్వడంలేదు. నా సమస్యపై ప్రతిఅధికారికి చెప్పినా పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు.కలెక్టర్, రెవెన్యూ అధికారులను కలిసాను. సమస్య పరిష్కారం మార్గం చూపడంలేదు.
తహసిల్దార్ సరిత వివరణ:
అర్ యస్ ఆర్ ప్రాబ్లం ఉన్నమాట వాస్తవమే కాని పాత పాస్ పుస్తకం వుండి కొత్తది కావాలంటే ఆ సర్వే నెంబర్ లొ ట్రాలీ అయితేనే ఎక్కీయవచ్చు. ఎక్సేస్ వస్తె మాత్రం ధరణీ లో ఆప్షన్ రాలేదు. ఆప్షన్ రాగానే సమస్యను క్లియర్ చేస్తాం .