Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఎంపిడిఓ, ఏ.పి.ఓ.ల వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ

ఎం.పి.డి.ఓ.లు., ఏ.పి.ఓ.లకు వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జడ్.పి.సి.ఈ. ఓ., డి.ఆర్.డి.ఓ.లను జిల్లా కలెక్టర్ ఆదేశం

*అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రశాంతి జీవన్ పాటిల్.*

నల్లగొండ పిబ్రవరి 9.(నిజంన్యూస్):
నల్లగొండ జిల్లాలోని ప్రతి మండలంలోని జి.పి.లలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు పెద్ద యెత్తున చేపట్టి కూలీ లకు పనులు కల్పించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎం.పి.డి.ఓ.లు ఎ.పి.ఓ.లను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ హెచ్చరించారు.

బుధవారం జిల్లా కలెక్టరేట్ నుండి ఎం.పి.డి.ఓ.లు, ఎం.పి.ఓ.లు, ఎ.పి.ఓ.లు, పి.ఆర్.డి.ఈ. లు, ఎ.ఈ లు, వ్యవసాయ శాఖ ఏ.డి.లు, వ్యవసాయ అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్పరెన్సు నిర్వహించారు.
ఈ వీడియా కాన్ఫరెన్స్ ద్వారా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు, నర్సరీ లలో మొక్కల పెంపకం, వైకుంఠ దామం ల నిర్మాణ పనులు ప్రగతి, పంట పొలాల్లో నూర్పిడి కల్లాల నిర్మాణం పనులను మండలం ల వారిగా జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

ప్రతి జి.పి.లో సరాసరి 50 మంది కూలీలకు పనులు కల్పించాలని, ఇందుకు పనులు గుర్తించాలని సమీక్ష లో ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొన్ని మండలాలు పనులు చేపట్టడం లో వెనుక బడి ఉన్నాయని జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులు చేపట్టి, పనులు కల్పించడం లో వెనుక బడిన చింత పల్లి, గుండ్ల పల్లి, నిడమనూర్ మండలాల ఎం.పి.డి.ఓ.లు., ఏ.పి.ఓ.లకు వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జడ్.పి.సి.ఈ. ఓ., డి.ఆర్.డి.ఓ.లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

వీడియా కాన్ఫరెన్స్ కు అనుమతి లేకుండా గైర్హాజరైన నేరేడు గొమ్ము ఏ.పి.ఓ.కు మెమో జారీ చేయాలని డి.ఆర్.డి.ఓ.ను కలెక్టర్ ఆదేశించారు. రాబోయే వేసవికాలం దృష్టిలో వుంచుకుని ఉపాధి హమీ పనులను గుర్తించి లేబర్ ను సిద్దం చేసుకోవడానికి తగిన ప్రణాళికలు తయారు చేయాలని ఎం.పి.డి.ఓ.లను, ఎ.పి.ఓ.లను ఆదేశించారు. రోజు వారీగా ఉపాధి హమీ లేబర్ పెరిగే విధంగా టార్గెట్ పెట్టుకుని పని చేయాలన్నారు.

గ్రామ పంచాయితీలలో ఉపాధి హమీ పనుల పర్యవేక్షణ పూర్తిస్థాయిలో పంచాయితీ కార్యదర్శి నిర్వహించాలన్నారు. ఉపాధి హామీ పనులలో భాగంగా పల్లె ప్రకృతి వనం, నర్సరీలలో మొక్కల పెంపకంపై దృష్టి సారించాలన్నారు. పల్లె ప్రకృతి వనాలకు కౌంపాండ్, గేట్ల ఏర్పాటు, విద్యుత్ సౌకర్యం, నీటి సదుపాయం కోసం బోర్లు లేదా ట్యాంకర్లు, అద్దె మోటార్లు మొదలగు మౌలిక సదుపాయాలను ఎం.పి.డి.ఓ.లు, ఎ.పి.ఓ.లు పర్యవేక్షించాలన్నారు.

అంతేగాక మొక్కల సంరక్షణ కోసం వాచర్లను నియమించాలని కలెక్టర్ సూచించారు. పల్లె ప్రకృతి వనం, నర్సరీలలో తొందరగా పెరిగే మొక్కలు పెంచాలని, అందుకు అవసరమైన సీడ్స్ ను సంబంధిత వ్యవసాయ అధికారులు సహాకారం అందించాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేయాలని వ్యవసాయ శాఖ జె.డి.ని ఆదేశించారు. రైతు వేదికల నిర్మాణ పనులు ఎక్కడ నిలిచిపోయాయో గుర్తించి వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కోరారు. మొక్కలు బ్రతికే ఉన్నాయా లేవా అని ప్రతి మండలం వారీగా అడిగి తెలుసుకుని, మొక్కలు ఎక్కడైనా చనిపోయినట్లు తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అధికారులకు తెలిపారు.