మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్ ను అడ్డుకున్న డిఎస్పి నాయకులు

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 9 (నిజం న్యూస్)
విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కి బుధవారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో దళిత శక్తి వారియర్స్, డీఎస్పీ నుంచి నిరసన సెగ తగిలింది. గత కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగం పట్ల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా కేంద్రంలోని వినాయక చౌరస్తా వద్ద డీఎస్పీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు.
అయితే ఈ నెల 12న జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో సభ స్థలాన్ని పరిశీలించడానికి పరిశీలించడానికి వచ్చిన మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్ గమనించిన డీఎస్పీ కార్యకర్తలు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో కాన్వాయిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని మంత్రి కాన్వాయ్ కి అంతరాయం కలగకుండా అక్కడి నుండి పంపించేశారు.