మోడీ వ్యాఖ్యలు అనుచితం…న్యాయవాదులు

మోడీ వ్యాఖ్యలు అనుచితం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ గురించి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని న్యాయవాదులు ఖండించారు. టి.ఆర్.ఎస్. లీగల్ సెల్ ఆధ్వర్యంలో బుధవారం న్యాయవాదులు నల్ల రిబ్బన్లు ధరించి కోర్టు ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం గురించి ప్రధాని చేసిన వ్యాఖ్యలు తెలంగాణవాదుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆ వ్యాఖ్యలను ప్రధాని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జక్కుల నాగేశ్వరరావు, కాల్వ శ్రీనివాసరావు,కుక్క డపు నరసింహారావు, ఆర్. వి. రమణ రెడ్డి, నాగేశ్ రాథోడ్, ఉదారి యాదగిరి, బానోతు శంకర్ నాయక్, తండు హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.