పంట నష్టపరిహారం కోసం గిరిజనుల ఎదురుచూపులు?

పంట నష్టపరిహారం కోసం ,గిరిజనుల ఎదురుచూపులు?
ఎస్ఆర్ఎస్పి కాలువ గండి బడి నష్టపోయిన రైతులను ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆదుకోవాలని వేడుకోలు.
తుంగతుర్తి ,ఫిబ్రవరి 9 నిజం న్యూస్
తెలంగాణ రాష్ట్రంలో కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా జలాలు, ఎస్ ఆర్ ఎస్ పి కి చేరుకొని కాలువల ద్వారా తుంగతుర్తి నియోజకవర్గానికి చేరుకొని, సాగు విస్తీర్ణం పెరిగి, రైతులు ఆనందంగా ఉంటున్న తరుణంలో తుంగతుర్తి మండలం లోని ఎస్ ఆర్ ఎస్ పి 69 , మేజర్ కాలువ ద్వారా మానాపురం గ్రామానికి చిన్న కాలువ ద్వారా సాగునీరు ఉధృతంగా ప్రవహించడంతో కాలువకు గండి పడటంతో సుమారు 15 మంది రైతులు, 23 ఎకరాలను వరి పంటలో పూర్తిగా నష్టం వాటిల్లింది. ఎస్ ఆర్ ఎస్ పి అధికారులు మాత్రం మూడు రోజులు శ్రమించి, తూతూమంత్రంగా పనులు నిర్వహించి చేతులు దులిపారు. అనంతరం మళ్లీ కాలువలో నీళ్ళు రావడంతో, అదే ప్రాంతంలో గండి పడడం అధికారుల పనితీరుకు పరాకాష్ట గా మారింది. చివరకి ఆగమేఘాల మీద అధికారులు వచ్చి, సంబంధిత కాంట్రాక్టర్లతో, కాల్వకు నూతన షట్టర్ అమర్చారు. ఇదిలా ఉంటే గండి పడిన సంఘటనలు ముఖ్యముగా లకావత్ శేఖర్, గోపీచంద్, వారి భూములు పూర్తిగా నీరు ప్రవాహములో కొట్టుకొని పోయాయి దీనికి ఒక రైతు ఎకరాకు సుమారు 20 వేల రూపాయల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపరిహారం చెల్లించని ఎడల మాకు అప్పులు మిగిలి , ఆత్మహత్యల శరణ్యంగా మారుతాయని పేద గిరిజనులు కన్నీరు పర్వత మయ్యారు.
తక్షణమే జిల్లా కలెక్టర్ , ఎమ్మెల్యే స్పందించి వరి పైరు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించే దిశలో చర్యలు తీసుకోవాలని పేద గిరిజన రైతులు కోరుతున్నారు… తమకు జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి, తీసుక పో న్నట్లు పేర్కొన్నారు…