మాట తప్పిన కేసీఆర్ -చందన రెడ్డి

విద్యార్థుల జీవితాలతో చెలగాటామా..?

జనగామ ఫిబ్రవరి8(నిజం న్యూస్):
జనగామ జిల్లా లో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ మరియు పాలిటెక్నిక్ కాలేజీలు మంజూరు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపొగ,ఫిబ్రవరి 11న జనగామ జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టర్ కార్యాలయం మరియు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం శంకుస్థాపనకు వస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటనే తను ఇచ్చిన హామీని నెరవేర్చి జనగామ జిల్లాకు రావాలని, డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్యవేదిక (జేఏసీ)తలపెట్టిన లక్ష సంతకాల సేకరణ లో పాల్గొనడం జరిగింది.