కుక్కను చంపారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

సూర్యాపేట జిల్లా కోదాడ అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామంలో మూగ  జంతువైనా తన కుక్కను గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంజక్షన్ చేసి చంపేశారు అని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కుక్క యజమాని పట్టించుకోని పోలీసులు .

కుక్క యజమాని మాట్లాడుతూ ఇంట్లో గొలుసు వేసి కట్టేసిన కుక్కను ఎటువంటి సమాచారం ఇవ్వకుండా చాటింపు వేయకుండా గ్రామ సర్పంచ్ కార్యదర్శి కలిసి పథకం ప్రకారమే గ్రామ పంచాయతీ సిబ్బంది తో చెప్పి విషపు ఇంజక్షన్ చేసి చంపేశారు అని అన్నారు.నేను చాలా ప్రేమగా ఇంట్లో మా పిల్లలతో సమానంగా చూసుకునే కుక్క అది దానిని అన్యాయంగా చంపేశారు అని చాలా బాధ వ్యక్తం చేశారు. నోరులేని మూగజీవాలను చంపే హక్కు ఎవరు ఇచ్చారు అని అన్నాడు. నేను ప్రేమగా పెంచుకున్న కుక్క ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉంది అన్నారు బ్రతికి ఉంటే ఇంకో 15 రోజులలో పిల్లలను కనే టైం లో దాన్ని అన్యాయంగా ఇంటి లోపల గొలుసులతో కట్టేసి ఉన్న కుక్కకు ఇంజక్షన్ చేసి చంపేశారు అని అన్నాడు. దీనికి కారణమైన వారిని కచ్చితంగా శిక్షించాలని అసలు మూగజీవాల చంపే హక్కు ఎవరిచ్చారని నాకు జరిగిన అన్యాయం ఇక ఏ గ్రామంలో కూడా పెంపుడు కుక్కలను చంపే విధంగా జరగకుండా చర్య తీసుకోవాలని అన్నారు. అవసరమైతే కుక్క మృతదేహానికి పోస్టుమార్టం చేయించి అక్క ని చంపిన వారికి ఖచ్చితంగా శిక్షపడేలా చూడాలని కోరారు. అవసరమైతే కోర్టుకు కూడా వెళతామని తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే విధంగా గతంలో కూడా ఎంతో ప్రేమతో పెంచుకున్న కుక్కను కూడా ఇలాగే చంపేశారు అని అన్నాడు.