హెవీ ఇసుక లారీలతో రహదారి ధ్వంసం…వాహనదారులకు గాయాలు

 

హెవీ ఇసుక లారీలతో ప్రధాన రహదారి ధ్వంసం… వాహనదారులకు గాయాలు

చర్ల ఫిబ్రవరి 7 (నిజం న్యూస్) మండలంలోని గుంపెన గూడెం గ్రామం వద్ద ఏవి ఇసుక లారీల కారణంగా ప్రధాన రహదారి ధ్వంసమై పెద్ద గుంత పడడంతో వాహనదారుల కు ప్రాణసంకటంగా మారింది సోమవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది గుంపెనగూడెం గ్రామం వద్ద భగీరథ పైప్ లైన్ ప్రధాన రహదారిని తవ్వి ఇళ్ళకు పైపులైన్ అమర్చారు ఏవీ ఇసుక లారీలు రద్దీ గా తిరగడంతో బీటీ రోడ్డు ధ్వంసమై ద్విచక్ర వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో భద్రాచలం వైపు నుండి ద్విచక్రవాహనంపై వస్తున్నపాయం వీరస్వామి వెంకటాపురం రెవెన్యూ కార్యాలయంలో సర్వేర్ గా పనిచేస్తున్నారు ఆయన సతీమణి రాజ్యలక్ష్మి. ప్రణీత్ లు అదుపుతప్పి ద్విచక్ర వాహనం పై నుండి పడ్డారు రాజ్యలక్ష్మి. ప్రణీత్ లకు గాయాలయ్యాయి స్థానికులు చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భూపాలపల్లి నుండి హైదరాబాదు వైపు వెళ్లవలసిన ఇసుక లారీలు మేడారం జాతర కారణంగా ఇసుక లారీలను అటువైపు నిలిపివేయడంతో ఇసుక లారీలు రద్దీగా తిరగడంతో రోడ్డు ధ్వంసమైంది.రాత్రి వేళ అది వాహనదారులు గమనించక పోవడంతో వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది