సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4(1)(బి) అమలు ఎక్కడ ?
-హమారా పైసా …
హమారా హిసాబ్
డబ్బు మాది … లెక్కలు మాకు తెలియాలి
-ప్రభుత్వ యంత్రంగం స్వచ్ఛందంగా
ప్రజలకు సమాచారం అందించాలన్నదే
స.హ. చట్టం ప్రధానోద్దేశం…..
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి7(నిజం న్యూస్)
ప్రభుత్వ సంస్థలు తమ పని తీరుకు సంబందించిన కీలక సమాచారాన్ని స్వచ్చందంగా వెల్లడించాలని సమాచార హక్కు చట్టంలో పేర్కొన్నా రాష్ట్రంలో మాత్రం గ్రామ పంచాయితీ నుండి మండల , జిల్ల,రాష్ట్ర స్థాయి ప్రభుత్వ సంస్థ వరకు సమాచార హక్క చట్టం 2005 లోని సెక్షన్ 4(1)(బి) ఏ ప్రభుత్వ కార్యలయంలో ఆచరణలో అమలు కావడం లేదు అని బొబ్బిలి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు స.హ. చట్టం ప్రకారం ప్రతి ప్రభుత్వ యంత్రంగం 17 అంశాల సమాచారాన్ని స్వచ్ఛందంగా ప్రజలకు అందంబాటులో ఉంచాలి . అవి
1. సంస్థకు సంబందించిన వివరాలు విధులు బాధ్యతలు ,
2. శాఖలు / సంస్థల అధికారులు , ఉద్యోగుల అధికారులు , విధులు ,
3. నిర్ణయాలు తీసుకోవడానికి అనుసరించే పద్దతులు , పర్యవేక్షణ , జవాబుదారితనానికి ఉన్న మార్గాలు
4. తమ బాధ్యతల నిర్వహణకు రూపొందించిన నియమావళి
5. ఉద్యోగుల బాధ్యతల నిర్వహణకు వినియోగిస్తున్న నియమావళి , రెగ్యులేషన్లు , ఆదేశాలు , మాన్యువళ్లు , రికార్డులు
6. తమ వద్ద ఉన్న / తన ఆధీనంలో ఉన్న వివిధ డాక్కుమెంట్ల పట్టిక
7. డాక్కుమెంట్ల విధాన రూప కల్పన / అమలు చేసే ప్రక్రియలో ప్రజా ప్రతినిధులతో సంప్రదింపులకు / ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించడానికి ఏదైన ఏర్పాటు ఉంటే దాని వివరాలు
8. ప్రతి ప్రభుత్వ యంత్రాంగ బోర్డులు , కౌన్సిళ్లు , కమీటీలు , సంస్థలో ఏర్పాటు చేసుకున్న సలహా సంఘ సభ్యుల పట్టిక ఇతర విభాగాల సమావేశాలు , బహిరంగమైన వేనా? కాదా ? ఆయా సమావేశాల మినిట్స్ ప్రజలకు వెల్లడించేవేనా ? కాదా ?
9. అధికారులు , ఉద్యోగుల వివరాలను తెలిపే డైరెక్టరీ
10. అధికారులు , ఉద్యోగులు వ్యక్తిగతంగా ప్రతి నెల పోందే జీత భత్యాలు , రాయితీలు
11. తమ ఏజెన్సిలకు కేటయించిన బడ్జెట్లు ప్రణాళికలు , ప్రతిపాదిత వ్యయాలు, పంపిణీ చేసిన నిధుల నివేదికలు
12. రాయితీ కార్యక్రమాలను అమలు చేసే పద్దతి కేటాయించిన సొమ్ము లబ్ధిదారుల సమాచారం
13. రాయితీ లు , పర్మిట్లు , ఆథరైజేషన్లు పొందిన వారి వివరాలు
14. అందుబాటులో / ఆధీనంలో ఉన్న సమాచారం , ఎలక్ట్రానిక్ రూపంలో నిక్షప్తమైన సమాచారం
15. సమాచారం పొందడాని పౌరులకు కల్పించిన సధుపాయాలు , గ్రంధాలయాలు / రీడీంగ్ రూములు ఉంటే
ఉంటే వాటి పని వేళలు
16. సహాయ / ప్రజా సమాచార / అప్పిలేట్ అధికారుల పేర్లు , హోదాలు
17. ప్రతి ఏడాది పై అంశాల పై సవరించిన , తాజా సమాచారాన్ని ప్రకటించాలి.
– బొబ్బిలి సత్యనారాయణ ప్రముఖ స.హ. చట్టం కార్యకర్త / ఉద్యమకారుడు