Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఏయ్ బాబు కూరగాయలమ్మొద్దన్నానా..!

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ,సబితా ఇంద్రారెడ్డి.

బాబు నీది ఏ స్కూల్ రా….

మహేశ్వరం మోడల్ స్కూల్ మేడం.

పాఠశాలలో చదువు విస్మరించరాదు అని హితవు.

హైదరాబాద్ ఫిబ్రవరి 7 నిజం న్యూస్.

తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థుల చదువులో రాణించి ఉన్నతమైన ఉద్యోగాలు పొందాలని దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రములో ఏ దేశంలో లేని విధంగా గురుకుల పాఠశాలను ప్రారంభించి ఉన్నత, మైన విద్యతో పాటు, వసతి సౌకర్యాలు కల్పిస్తూ, వేల కోట్ల రూపాయలను, పేద విద్యార్థులకు, అందిస్తున్న తరుణంలో హైదరాబాదులోని ఓ సెంటర్ లో, పాఠశాల కు వెళ్లకుండా, ఓ విద్యార్థి కూరగాయలు అమ్ముతున్న దృష్టిని సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కంట పడింది. దీనితో ఆమె ఆ విద్యార్థిని ఆప్యాయంగా పిలుస్తూ పాఠశాల, వదిలి ఎందుకు వచ్చావురా, అని ప్రశ్నించగా.. ఆ విద్యార్థి కాలికి దెబ్బ తగిలింది మేడం అనగా దావకాన పోదాము రా అని అడగగా వద్దు మేడం అని సమాధానం… దీనితో ఆ పాఠశాల ఉపాధ్యాయులకు ఫోన్లో మాట్లాడారు. బాబు బాగా చదివి కష్టపడి ఉద్యోగాలు సంపాదించాలని, తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలని, మంత్రి హితవు పలకటం గమనార్హం…