Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఉపాధిహావిూలో కేంద్ర పెత్తనం

నిధులు నేరుగా విడుదల చేసేలా ఒత్తిడి
రాష్టాల్రకే అజమాయిషీఉండాలంటున్న నేతలు
ఉపాధి పనుల కోసం కోట్లలో నిధులు కుమ్మరించినా కూలీలకు చేతినిండా పనులు కల్పిస్తున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో పురోగతి లేదని అనేక సర్వేలు వెల్లడిరచాయి. ఉపాధిహావిూ పథకం అక్రమాలకు పుట్టగా తయారైనా, సమన్వయం లేని పథకంగా మారినా కేంద్రం మాత్రం దీనిపై సవిూక్ష చేయడం లేదు.

కేవలం పేదలకు భృతి కల్పిస్తున్నామని చెప్పి వేలకోట్ల రూపాయలను వృధా చేస్తున్నారు. నిజానికి ఈ పథకాన్ని రాష్టాల్రకు అనుసంధానం చేసివుంటే బాగుండేది. ఈ పథకం కింద నిధులు, విధులు రాష్టాల్రకు అప్పగించి, కేంద్రం అజమాయిషీ చేస్తే బాగుండేది. దీంతో గ్రామాల్లో పనులు జరగడంతో పాటు, అభివృద్ది కనిపించేది.

ఉపాధిహావిూ పథకంలో భాగంగా వివిధ శాఖల్లో చేపట్టబోయే పనులపై ఆ శాఖ అధికారులకు, ఉపాధిహావిూ అధికారులకు సమన్వయం కోసం సంబంధిత శాఖల అధికారులతో అవగాహన సమావేశం నిర్వహించాలని జిల్లాస్థాయి అధికారులు సూచించారు.

ఈ పనులు చేయించేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బంది సైతం నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తుండటంతో ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పథకాన్ని పూర్తిగా రాష్టాల్రకే వదిలేసి కేంద్రం నేరుగా నిధులు విడుదల చేస్తే అనుకున్న ఫలితం రాబట్టవచ్చు. కానీ అలా జరగడం లేదు.

ఇకపోతే ఉపాధిహావిూలో ప్రవేశపెట్టిన వందరోజుల పని కొందరికే పరిమితమవు తోంది. క్షేత్రస్థాయిలో పనులు కల్పించకపోవడంతో అనేక మంది పల్లె ప్రజలు ఇందుకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో నెలన్నర మాత్రమే గడువు ఉంది.

కానీ మిగిలిపోయిన పనిదినాలు చాలా ఉండటంతో ఈ ఏడాది వందరోజుల పని అసంపూర్తిగానే మిగిలి పోనుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీటిని సమన్వయం చేసుకుని ముందుకు సాగితే తప్ప పథకం లక్ష్యం నెరవేరదు. గతంలో కుటుంబంలోని అందరు వ్యక్తులు ఈ పనులకు హాజరయ్యేవారు.

అప్పట్లో ఈ పనులు తూతూమంత్రంగా చేయడం వల్ల ఆశించిన ఫలితం రాలేకపోయింది. క్రమంగా ఈ పనులపై ప్రభుత్వం నిశితంగా దృష్టి సారిస్తుండటంతో పాటు అనేక పనులకు ఉపాధిహావిూని జోడిరచింది. గ్రామాల్లో చేపడుతున్న దాదాపు అన్ని రకాల పనులు వీటి ద్వారానే చేపడుతుండటం ఈ పథకం ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది.

తెలుగు రాష్టాల్ల్రో హరితహారం,నీరు`చెట్టు, చెరువుల పునరుద్దరణ, మిషన్‌ కాతీయ, ప్రాజెక్టుల నిర్మాణం, ఇళ్ల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు అన్ని రాష్టాల్ల్రో సాగుతున్నాయి. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఇలాంటి కార్యక్రమాల ను ఉపాధితో జోడిస్తే డబ్బు ఆదా కావడంతో పాటు, పనులు జరిగేవి.

ఈ కార్యక్రమంపై పుంఖాను పుంఖాలుగా విమర్శలు వస్తున్నా సవిూక్షంచడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖలో చేపట్టే పనులకు ఉపాధిహావిూ నిధులు మళ్లించే ప్రయత్నంలో భాగంగా పథకంతో పలు శాఖలను అనుసంధానిస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.

దీంతో ఇక ముందు ఆయా శాఖల్లో కొత్తగా చేపట్టే పనులకు ఉపాధిహావిూ అధికారులతో పాటు మిగతా శాఖల అధికారులు కలిసి సమన్వయంతో ముందుకు సాగితేనే సత్ఫలితాలు లభిస్తాయి. కేంద్రం, రాష్టాల్రు వేర్వేరుగా ఆలోచన చేసే బదులు ఉమ్మడిగా ఆలోచన చేసి పథకాలను రూపొందిస్తే ప్రజాధనం వృధాకాకుండా అరికట్టడంతో పాటు అవసరమైన పనులు చేయగలుగుతాం.

ఇప్పటికే విద్య, పశువైద్యం, వ్యవసాయం, నీటి పారుదల, పంచాయతీ రాజ్‌ శాఖల పనులకు పథకంను అనుసంధానించగా, భవిష్యత్తుల్లో పరిపాలన పరమైన సాధారణ నిధులకు సైతం ఇదే పద్ధతిని అనుస రించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పై శాఖల్లో చేపట్టేందుకు అవసరమైన పనులు, నిధుల వివరాలను వెల్లడిరచి పనుల ఎంపికకు మార్గదర్శకాలు జారీ చేసింది.

క్షేత్రస్థాయిలో అవసరమైన పనులు గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరింది. పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతుల్లో భాగంగా మొదటి ప్రాధాన్యం కింద మూత్రశాలలు, మరుగుదొడ్లు, వంట షెడ్ల నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసింది.

వంటషెడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయనుంది. ఇందులో ఉపాధిహావిూ పథకం నుంచి 45 శాతం నిధులు మంజూరు చేస్తుండగా, పనుల అవసరాన్ని బట్టి మిగతా నిధులు సర్వశిక్ష అభియాన్‌ నుంచి పొందాల్సి ఉంటుంది. ఈ పనులను మండల విద్యాధికారి, పీఆర్‌ ఏఈల పర్యవేక్షణలో చేపడతారు.

పశు సంవర్ధక శాఖలో చేపట్టనున్న పనుల కు గ్రామ సభ తీర్మానం చేసిన ప్రతిని సంబంధిత మండల పశువైద్యాధికారికి సమర్పించి వారి అనుమతితో పనుల మంజూరుకు ప్రతిపాదనలు పంపించాలి. ఆసక్తి గల రైతులు సంబంధిత వ్యవసాయ శాఖ, పశువైద్యాధి కారులను సంప్రదించి దరఖాస్తులు చేసుకోవాలి. పంచాయతీరాజ్‌ శాఖలో వైకుంఠ ధామం, ధాన్యం రాశుల ఎండటంకోసం ప్లాట్‌ఫారంతో పాటు ఇతర పనులు చేసుకునే అవకాశముంది.

ప్రతి గ్రామ పంచాయతీలో అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలా ప్రభుత్వమే ప్రతి గ్రామంలో కొత్తగా శ్మశాన వాటిక నిర్మించేందుకు అవకాశం కల్పించింది. ఆయా గ్రామ పంచాయతీలో ప్రభుత్వ స్థలం ఉంటే వెంటనే సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులు క్షేత్రస్థాయి అవసరాలను గుర్తించి వాటిపై నివేదికను తయారుచేసి పంపించాలి.

ప్రభుత్వం కొత్త చేపట్టిన అనుసంధాన పక్రియ విధానంపై కూలీలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేందుకు గ్రావిూణ పేదరిక నిర్మూల సంస్థ ఐకేపి సౌజన్యంతో సభలు, సమావేశాలు, సదస్సులు నిర్వహించాల్సి ఉంది. చెరువుల పునరుద్దరణకు తెలంగాణ, ఎపిలో కోట్లు ఖర్చు చేస్తున్నారు. నిజానికి ఉపాధిని దీనికి జోడిరచివుంటే మంచి జరిగేది.

ఏ పని చేపట్టినా గ్రామ స్థాయిలో గ్రామసభ నిర్వహించి గ్రామసభ తీర్మానంతో కూడిన ప్రతిని సంబంధిత శాఖ అధికారుల పరిశీలనకు పంపి వారి అనుమతితో నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపించాలి. అలా కాకుండా రాష్టాల్ర అజమాయిషి లో పక్కాగా ప్లాన్‌ చేసివుంటే ప్రజాధనం వృధా అయ్యేది కాదు.

ఇటు కేంద్ర, అటురాష్ట్ర నిధులు ఆదా అయ్యేవి. అయితే ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల్లో భాగంగా ఆయా శాఖల వారీగా కేటాయించే నిధుల్లో ఇక నుంచి ఉపాధిహావిూ పథకం నుంచి 45 శాతం నిధులు కేటాయిస్తుండగా ఆయా శాఖల నుంచి 55 శాతం నిధులు వెచ్చించాల్సి ఉంటుంది.