Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఉపాధిహావిూని సంస్కరించాలి !

నీరుగారుతున్న ఉపాధిహావిూ పథకం ప్రగతి వైపు పరుగెత్తేలా కేంద్రం పథకాన్ని సరళీకరించాలి. పార్లమెంట్‌ సమావేశాల్లో దీనిపై చర్చించి రాష్టాల్ర అభిప్రాయాలు తీసుకోవాలి. ఉపాధిహావిూ పథకంతో గ్రామాల్లో కూలీలు దొరకని పరిస్థితి ఏర్పడి౦ది.

అదే సందర్భంలో ఉపాధి పనుల ద్వారా గ్రామాల్లో పినికి వచ్చే పనులు జరగడం లేదని,నిధులు దుబారా అవుతున్నాయన్న ఆందోళనా ఉంది. కేంద్రమే నేరుగా పథకాన్ని నిర్వహించడం వల్ల రాష్ట్రంలో ఏ పనులు చేపట్టాలో..ఏవి చేయించుకోవాలో రాష్టాల్రకు అధికారం లేకుండా పోయింది.

దశాబ్దంన్నర దాటినా ఇంతకాలం ఉపాధి పనులను చూస్తే బూడిదలో పోసిన పన్నీరుగా మారుతోంది. ఉపాధిహావిూని గ్రామాల అభివృద్దికి ఉపయోగించుకునే వెసలుబాటు ఉంది. ఉపాధి పథకం,నిధులు, వినియోగంపై తెలుసుకుని తమ గ్రామాలను అభివృద్ది చేసుకునే ప్రణాళికలు సిద్దం చేసుకోగలగాలి.

ప్రణాళికల ద్వారా గ్రామాలనుముందుకు తీసుకుని వెళ్లే అవకాశం రాష్టాల్రకు ఉండాలి. ఇటీవలి బడ్జెట్‌లో ఉపాధికి కొంతమేర నిధులు తగ్గాయి. ఈ పథకం మార్దగదర్శ కాలను మార్చాలి. నిర్మాణాత్మక పనులను రాష్టాల్ర అజమాయిషీలో కొనసాగించాలి.

ఈ విషయంలో పార్లమెంటులో ఆయారాష్టాల్ర ఎప్పిలు ఉమ్మడిగా చర్చించాలి. కేంద్రం కూడా రాష్టాల్ర అభిప్రాయలను తీసుకుని పథకాన్ని మరింత పక్కాగా అమలు చేసేలా తయారుచేయాలి. గ్రావిూణ నిరుపేదలకు కూలీ కల్పించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఉపాధిహావిూ పథకం లక్ష్యం నెరవేరడం లేదు.

సిబ్బంది నిర్లక్ష్యం.. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేమితో ఉపాధి పథకం నీరుగారిపోతోంది. ఓ పక్క గ్రామాల్లో కూలీ దొరక్క అల్లాడుతున్న పేదలకు నిరాశను మిగిలిస్తోంది. కూలీ దొరకడం లేదని కూలీలు అంటున్నారు. కూలీలు దొరక్క అసవ్థలు పడుతున్నామని రైతులు అంటున్నారు.

గ్రామాల్లో ప్రజలు కూడా ఇదే బాధను వ్యక్తం చేస్తున్నారు. మరి వీరంతా ఏమవుతున్నారు. ఎక్కడ లోపం ఉంది. ఎక్కడ సమన్వయం లోపించింది. అన్నదే అంతుచిక్కని వ్యవహారంగా ఉంది. ప్రధానంగా కేంద్ర,రాష్టాల్ర మధ్య సమన్వయం కుదరడం లేదు. పనుల విషయంలో ప్రణాళికలు లేవు. వేలాది కోట్లు ఉపాధిహావిూలో వెచ్చిస్తున్నా బూడిదలో పోసిన పన్నీరులా తయారయ్యింది.

గ్రామాల్లో పనులు దొరక్క.. చేతిలో డబ్బులు లేక..నిత్యావసర సరకులు కొన లేక ఇబ్బందులు పడుతున్న అనేక మంది పేదలకు పనులు కల్పించి ఆర్థిక భరోసా అందించాలనే ఉద్దేశం తో కేందప్రభుత్వం ఉపాధిహావిూ పథకానికి శ్రీకారం చుట్టింది.

ప్రారంభంలో కొన్ని పనులకే పరిమిత మైన ఈ పథకం.. 52రకాల పనులకు ఈ పథకాన్ని వర్తింపజేసింది. గ్రామాల్లో నీటి సంరక్షణ కోసం చేపడుతున్న పనులు, వ్యవసాయ బావుల నిర్మాణం, ఇంకుడుగుంతలు, మట్టికట్టలు, బావుల పూడికతీత, నాడేపు కంపోస్టు, వర్నీకంపోస్టు నిర్మాణా లు, వంట గదులు, పాఠశాలల మరుగుదొడ్లు, శ్మశానవాటికలు తదితర వాటిని చేపట్టాల్సి ఉంది.

పనులు చాలా ఉన్నప్పటికీ.. వాటిని చేయించడంలో గ్రావిూణ స్థాయిలో సిబ్బంది అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు ప్రభుత్వం నుంచి ఉపాధిహావిూ డబ్బులు సైతం సకాలంలో రాకపోవడంతో కూలీలు ఈ పనులకు వెళ్లేందుకు అనాసక్తి చూపుతున్నట్లు సమాచారం.

పనులకు సాంకేతికత కూడా అనుసంధానించి నిబంధనల మేరకు పనులు చేయాల్సి ఉంటుంది. పల్లెప్రగతితో తెలంగాణలో సిఎం కెసిఆర్‌ తీసుకున్న నిర్ణయంతో గ్రామాల్లో అభివృద్ది సాకారం కానుంది. తాజాగా సిఎం కెసిఆర్‌ నిధులను సంపూర్ణంగా వినియోగించు కొని గ్రామాల్లో హరితహారం, వైకుంఠ ధామాల నిర్మాణం చేపట్టాలని అధికా రులను ఆదేశించారు.

ఇది ఓ రకంగా సరైన దిశలో నిధులను ఉపయోగించుకునే కార్యక్రమంగా చూడాలి. సర్పంచ్‌లకు దిశానిరద్వేశం చేయడంతో గ్రామాల్లో అభివృద్ది పట్టాలకు ఎక్కుతుంది. నరేగా నిధులతో పాటు రాష్ట్ర బడ్జెట్‌ నిధులు, ఎంపీ, ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా ఉపయోగించుకొని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది.

నరేగా పథకం కింద కేంద్రం రాష్టాన్రికి ఎంత మొత్తంలో డబ్బులు ఇస్తుందో అంతే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించ డం ద్వారా పనులను సత్వరం చేసే అవకాశం ఉంటుంది. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోనే నరేగా పనులు జరుగాలి. గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడే ఆస్తులను సృష్టించడానికి నిధులను ఉపయోగిం చాల్సిన అసవరాన్ని గుర్తించాలి.

అన్ని గ్రామాలకు కచ్చితంగా బీటీ రోడ్లు ఉండేలా రహదారుల వ్యవస్థను నిర్మించాలి. గ్రామాల్లో జరుగుతున్న పనులను ప్రజా ప్రతినిధులు, అధికారులు అయ్యేలా నిఘా పెట్టాలి. ఇలా చేస్తూ పోతే కొంతకాలానికైనా అభివృద్ది కళ్లకు కనిపిస్తుంద నడంలో సందేహం లేదు.

ఇందులో భాగంగానే ప్రతి గ్రామంలో మొక్కలు నాటి, రక్షించాలి. గుంతలు తవ్వడానికి, నీళ్లు పోయడానికి, ఇతరత్రా పనులకు ఉపాధి నిధులను పూర్తిగా వినియోగించుకోవాలి. అటవీశాఖ అధి కారుల సలహాలు, సాంకేతిక సహకారంతో గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేయాల్సి ఉంది.

మొక్కలు పెట్టడం, వాటిని రక్షించడంలాంటి బాధ్యతలు గ్రామపంచాయతీలు చేపట్టాలన్న నిబంధ నలు విధించాలి. గ్రామాలను అభివృద్ది చేసుకునేలా సర్పంచ్‌లకు బాధ్యతలు కల్పించాలి. గెలుపొందారు. నిధులకు ఇబ్బంది లేకుండా ఉపాధి పథకాన్ని గ్రామాల అభివృద్దికి జోడిరచాలి. రహదారులు లేని గ్రామాలు అనేకం ఉన్నాయి. విద్యుత్‌ లేని గ్రామాలు ఉన్నాయి.

అలాంటి గ్రామాల సర్పంచ్‌లు చొరవ తీసుకుని ముందుకు సాగాలి. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు కచ్చితంగా బీటీ రోడ్లు ఉండాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుని ఇందుకు ఉపాధి పనులను జోడిరచేలా పథకంలో మార్పులు చేర్పులు చేయాలి.

సర్పంచ్‌లంతా తమ గ్రామాలకు సంబంధించి ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి. వీటి కోసం వెంటనే ప్రతిపాదనలు తయారుచేసి, పనులు ప్రారంభించేలా కార్యాచరణ సాగేలా చూడాలి. అప్పుడే గ్రామాల్లో పనులు దక్కడమే గాకుండా పల్లెల ప్రగతికి మార్గం దక్కనుంది. ఆయా గ్రామాల సర్పంచ్‌ల ప్రతిభ,పట్టుదల తోడైతే ప్రగతి సాధ్యం కానుంది.