సబ్ స్టేషన్ ఆపరేటర్ నిర్వాహం… షాక్ తో యువకుడు మృతి ?

సబ్ స్టేషన్ ఆపరేటర్ నిర్వాహం… షాక్ తో యువకుడు మృతి…?

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం దిర్శిం చర్ల సబ్ స్టేషన్ లో కరెంటు షాక్ కొట్టి యువకుడు మృతి చెందిన సంఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే సబ్ స్టేషన్ పక్కన తన పొలంలో యూరియా చల్లుతున్న సతీష్(35) అనే యువకుడిని సబ్ స్టేషన్ ఆపరేటర్ పిలిచి ఆన్ ఆఫ్ స్విచ్ బటన్ పట్టుకొమ్మని చెప్పి కిందకు అనగానే కరెంటు షాక్ తగిలి చనిపోయినట్లుగా బంధువులు చెబుతున్నారు. సబ్ స్టేషన్ ఆపరేటర్ మాత్రం తన చేతికి గ్లౌజులు వేసుకున్నట్లు గా తెలుపుతున్నారు మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. చావుకి కారణమైన సబ్ స్టేషన్ ఆపరేటర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని  ప్రధాన రహదారిలో ధర్నాకు దిగారు.