యశ్వంత్ గుండె ఆపరేషన్ కు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి భరోసా
యశ్వంత్ గుండె ఆపరేషన్ కు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి భరోసా !
భరోసా కల్పించిన ఎమ్మెల్యే కు కుటుంబ సభ్యులు, మేధావులు, ప్రజలు ప్రత్యేక అభినందనలు.
నల్లగొండ, ఫిబ్రవరి 7 నిజం న్యూస్
కులం, మతం, ప్రాంతం కాదు ఆ కుటుంబానికి కావాల్సింది భరోసా :- నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (తన నియోజకవర్గం కాకపోయినా కష్టాల్లో ఉన్నారని తెలియగానే పిలిపించి మాట్లాడిన భూపాల్ రెడ్డి)
పేదలకు సహాయం చేయడంలోనే నాకు ఆనందం .. మీకు నేనున్నా చిన్నోడి హార్ట్ సర్జరీ నా బాధ్యత అని భరోసా ఇచ్చిన కంచర్ల … వెంటనే డాక్టర్స్ తో మాట్లాడి సర్జరీకి ఏర్పాటు
నల్గొండ జిల్లా మునుగోడు మండలం గుడాపూర్ కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన అక్కేనపల్లి శివశంకర్ -లావణ్య ల కుమారుడు యశ్వంత్(10నెలలు)కు గుండెకు 2 రంద్రాలు పడ్డాయి సర్జరీ చేయడానికి లక్షల్లో ఖర్చు … రెక్కడితే గాని డొక్కాడని ఆ కుటుంబానికి అండగా ఉందాం అనే పోస్ట్ చూసి ఇంటికి పిలిపించుకొని అండగా ఉంటాను అని ధైర్యం ఇచ్చాడు.