బైకులు ఢీకొని ఇరువురికి గాయాలు

రెండు బైకులు ఢీకొని ఇరువురికి గాయాలు
తుంగతుర్తి, ఫిబ్రవరి 7 నిజం న్యూస్
తుంగతుర్తి జాతీయ రహదారిపై మద్దిరాల నుంచి తుంగతుర్తి కి వస్తున్న బైకును, వెనక నుండి మరో బైక్ ఢీకొట్టడంతో ఇరువురికి బలమైన గాయాలు అయిన సంఘటన సోమవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మద్దిరాల నుంచి వస్తున్న ఫ్యామిలీ బైక్ , వెనక నుండి మరో బైక్ వచ్చి తగలడంతో బలమైన గాయాలైనట్లు, బాధితులు తెలిపారు. తక్షణమే వారిని తుంగతుర్తి దవాఖానకు తరలించినట్లు పేర్కొన్నారు. జరిగిన సంఘటన పై తుంగతుర్తి పోలీసులు విచారణ జరిపి, కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.