సీఎం పై రాజద్రోహం, దేశ ద్రోహం కింద చట్టపరంగా శిక్షించాలి
సీఎం కేసీఆర్ పై రాజద్రోహం దేశ ద్రోహం కింద చట్టపరంగా శిక్షించాలి
– సీఎం కేసీఆర్ భారత ప్రజానీకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి .
– రాష్ట్ర గవర్నర్ సీఎం కేసీఆర్ ను తక్షణమే భర్తరఫ్ చేయాలి.
వరంగల్ ఫిబ్రవరి6(నిజం న్యూస్):
వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ”ప్రజాసంఘాల ఆధ్వర్యం”లో భారత రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ”నిరసన కార్యక్రమాన్ని” ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మాంకాల యాదగిరి మాట్లాడుతూ ప్రజా ప్రపంచ మేధావి భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ కష్టపడి రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రాజ్యాంగాన్ని రాసి భారత దేశానికి దిశా నిర్దేశం ఇచ్చి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి అంబేద్కర్, అట్టి మహోన్నతమైన రాజ్యాంగాన్ని వ్యతిరేకించే హక్కు ఎవరికీ లేదన్నారు, సి ఐ టి యు రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ చాగంటి వెంకటయ్య మాట్లాడుతూ కెసిఆర్ సీఎం కావడం రాజ్యాంగం చలవే అని అతి విశాలమైన రాజ్యాంగాన్ని కొత్తగా రాయడం యావత్ భారత దేశాన్ని అవమానించడమేనని, సిగ్గుచేటని యావత్ భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు, వ్యవసాయ కార్మిక సంఘం వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు వెంకన్న మాట్లాడుతూ కుల దురహంకార ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లపై ఆధిపత్యానికి పాల్పడుతూ , మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా రాచరిక వ్యవస్థను కొనసాగించి రాజరిక పాలన సాగించాలని రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడినందుకు రాజద్రోహం దేశ ద్రోహం కింద చట్టపరంగా శిక్షించాలి అన్నారు, ఇంకా ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మాదారపు మాణిక్యం ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకురాలు కవిత వికలాంగుల హక్కుల జిల్లా నాయకులు రాజు యాదవ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మారంపల్లి కో మ్మలు ఎమ్మార్పీఎస్ మండల నాయకులు జన్ను రవి ,కార్మిక సంఘం నాయకులు ప్రభాకర్, యాకయ్య ,మనబోతుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు,