కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలులో 36 కిలోల గంజాయి పట్టివేత

కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలులో 36 కిలోల గంజాయి పట్టివేత
ఖమ్మం, నిజం న్యూస్ కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలులో ఖమ్మం ఆర్పీఎఫ్ సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో 36 కిలోల గంజాయి లభ్యమైంది. ఈమేరకు వివరాలిలా ఉన్నాయి. భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో శనివారం ఖమ్మం రైల్వే స్టేషన్ నందు ఆర్పీఎఫ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ 7 కోచ్ లో నాలుగు బ్యాగులు అనుమానాస్పదంగా ఉండడంతో పరిశీలించగా గంజాయి లభ్యమైంది. వ్యవసాయ కూలీ, ఒడిశాలోని గజపతి జిల్లా అనురూరు గ్రామానికి చెందిన రంజిబ్బీర చత్రాపూర్ లో రూ. 7. 50 లక్షల విలువైన 36 కేజీల గంజాయి కొనుగోలు చేసి ముంబైలో అమ్మేందుకు వెళ్తుండగా స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. తనిఖీల్లో ఖమ్మం రైల్వే సర్కిల్ సీఐ ఇంద్ర సేనారెడ్డి, ఆర్పీఎఫ్ సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సైలు రవికుమార్, వెంకటరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.