అవమాన భారంతో యువతి ఆత్మహత్య

కేసు నమోదు చేసిన ఎస్సై: సీమా ఫార్హీన్

వరంగల్ ఫిబ్రవరి6(నిజం న్యూస్):
ప్రేమించిన పాపానికి అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్న యువతి. మృతురాలి తండ్రి అంజి పిర్యాదు మేరకు (మండల) కేంద్రానికి చెందిన అంజలి(15) జహీర్ అనే యువకుడిని కొంత కాలంగా ప్రేమించింది. అట్టి విషయాన్ని తెలుసుకొని మృతురాలి అక్క శనివారం జహీర్ ఇంటికి వెళ్ళి నిలయాధీయగా జహీర్ తో పాటు అతని కుటుంబ సభ్యులు అందరూ కలిసి అవమాన పరిచే విధంగా దుర్భాషలాడి ఇంటి నుంచి వెళ్లగొట్టారు. అయితే జరిగిన విషయం అక్క ద్వారా తెలుసుకున్న అంజలి బయటకి వెళ్ళొస్తా అని చెప్పి దగ్గర్లో ఉన్న వ్యవసాయ బావి లో దూకి ఆత్మహత్యకు చేసుకుందని పిర్యాదు చేసినట్లు నేక్కొండ ఎస్సై సీమా ఫార్హీన్ తెలిపారు.