విధులకు డుమ్మా కొట్టే అధికారుల తీరు పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం

నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించం
మిర్యాలగూడ పిబ్రవరి 06.(నిజంన్యూస్): విధుల పట్ల నిర్లక్ష్యం, ప్రజా సమస్యలు పట్టని అధికారుల తీరును ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని అలాంటి వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ కు ఫిర్యాదు చేయాలని మండల సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేయాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మండిపడ్డారు.
ఆదివారం వేములపల్లి మండల కేంద్రములోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశమందిరంలో ఎంపీపీ పుట్టల సునిత కృపయ్య అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్వసభ్య సమావేశంలో మెజారిటీ మండలస్థాయి అధికారులు హాజరు కాలేదు.
అధికారులు గైర్హాజరు కావడం పట్ల ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేని అధికారులు సెలవుపై వెళ్లిపోవాలని ఆగ్రహించారు. మిషన్ భగీరథ పనులు పూర్తి చేయడంలో అలసత్వం వహిస్తున్న అధికారులతోపాటు విద్యుత్, వ్యవసాయ, విద్య ,తదితర శాఖల అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి పార్టీలకు అతీతంగా పల్లెల ప్రగతికి కృషి చేయాలని కోరారు. మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోఎవ్వరూ రాకపోయేసరికి గంట సేపు నిరీక్షించాల్సి వచ్చింది. తరువాత అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశానికి హాజరుకావడం గమనార్హం.
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. వేములపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎంపీపీ పుట్టల సునీత కృపయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పాదూరి గోవర్ధని, ఎంపీడీఓ అజ్మీరా దేవిక, ఎంపీటీసీలు నంద్యాల శ్రీరాంరెడ్డి, చల్లబట్ల చైతన్య ప్రణీత్ రెడ్డి, మేక లలిత రవి, గడ్డం రాములమ్మ వెంకన్న, పల్లా వీరయ్య, సర్పంచులు దొంతిరెడ్డి వెంకట్ రెడ్డి, మజ్జిగపు పద్మ సుధాకర్ రెడ్డి, అంకెపాక రాజు, చెర్కుపల్లి కృష్ణవేణి సుమన్, పీఏసిఎస్ చైర్మన్ జెర్రిపోతుల రాములు గౌడ్ , నాయబ్ తహశీల్దారు నిర్మలదేవి, పంచాయితీ రాజ్, మిషన్ భగీరథ, గ్రామీణ త్రాగునీటి సరఫరా శాఖల ఏఈలు ఆదినారాయణ, వెంకట్ రెడ్డి, చిన్యా నాయక్, ఏవో ఋషింద్రమణి, ఎంపీవో శ్రావణ్ కుమార్, రాజరాజేశ్వరీ, పద్మ, తదితరులు పాల్గొన్నారు.