టిఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు!

టిఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు!
తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ .
నల్లగొండ పట్టణములో ఆదివారం రోజున తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ నివాసంలో తుంగతుర్తి కేంద్రానిక చెందిన మద్దెలప్రేమయ్య, మల్లయ్య, చంద్రయ్య వారితో పాటు 50 మంది నాయకులు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీ పార్టీకి రాజీనామా చేసి , నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గాదరి కిషోర్ కుమార్ చేతులమీదుగా టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి ప్రతి ఒక్కరి గుర్తింపుతో పాటు, అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య, ఎంపిటిసి చెరుకు సుజనా పరమేష్, తదితరులు పాల్గొన్నారు.