Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అడవి తల్లే వారికి శ్రీరామరక్ష..గుత్తికోయ పల్లెలకు తాకని కరోనా

*అడవి తల్లే వారికి శ్రీరామరక్ష

*గుత్తికోయ పల్లెలకు తాకని కరోనా

*ఆదినుంచి భౌతిక దూరం తోనే సహజీవనం*

చెట్ల ఆకులు వారికి మాస్క్ లు

చర్ల ఫిబ్రవరి 5 (నిజం న్యూస్) ఔషధ జలాలే ఆ జనులకు శానిటైజర్లు భౌతిక దూరం వారి తరతరాల ఆచారం స్వచ్ఛమైన ఆహారమే దారుడ్య రహస్యం కొండకోనలే వారికి ప్రపంచం. కరోనా కాదు కదా కల్లోలం వచ్చినా వారి కి బలాదూరే ఎందుకంటే ఆ ప్రకృతి ప్రసాదం లో వారి శక్తి యుక్తులు అపారం. ఎవరా అడవి వీరులు అనుకుంటున్నారా మనోళ్లే ఆదివాసీలు ప్రభుత్వం మాటే వారికి శాసనం అడవితల్లి వారికి శ్రీరామరక్ష భూమండలం లోని మానవాళిలో కల్లోలం రేపిన వారిదరిచేరలేదు అయినా ఆ మహమ్మారి కట్టడి కోసం కారడవిలో కీకారణ్యంలోని గ్రామాల ఆదివాసీలు ఎంతో ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసి ఆదర్శంగా నిలుస్తున్నారు.

బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న తమను తామే లాక్డౌన్ చేసుకున్న ఆదివాసీలు కలో గంజో తాగుతూ స్వీయనియంత్రణ లో కరోనాకష్టకాలంలో గడిపారు. సంస్కృతిలో భాగంగా ఆదినుంచి అడవిలోనైనా. బజారు కు వచ్చినా. భౌతిక దూరానికి పెద్ద పీట వేస్తారు అడవి తల్లి నుండి వచ్చే మధురమైన తేనె. తునికి పండ్లు నేరేడు సీతాఫలం మురళి పండ్లు .అడవి మామిడి పండ్లు .పాల పండ్లు . తినడం ద్వారా అడవిబిడ్డల ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తున్నా యని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

కరోనా సమయంలో ఖరీదైన మాస్కులు కొనలేని ఆదివాసి అడవి బిడ్డలు చెట్ల ఆకులను వారుమా స్కూల్ గా ఉపయోగించి కరోనా వారి దరిచేరకుండా అరికట్టడానికివరుప్రయత్నిస్తున్నారు . అడవినుండిఆదివాసి బిడ్డలకు లభించే అటవీ ఉత్పత్తులు వారి జీవన శైలే ఆయా పల్లెలను కరోనా దరిదాపుల్లోకి రాకుండా వారిలో వ్యాధి నిరోధక శక్తి చాలాఅధికంగాఉంటుందని అనడంలో సందేహం లేదు. ( మౌనిక సత్యనారాయణపురం పిహెచ్ సి వైద్యాధికారి) మా పరిధిలో 11 గొత్తికోయగ్రామాలు ఉన్నాయని కరోనాఆ గ్రామాలను ఇప్పటివరకు తాకలేదని గుత్తికోయల్లో వ్యాధినిరోధకశక్తి ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు అన్నారు ఎన్నో పోషకాలు ఉన్న అటవీ ఫలాలతో పాటు వంటల్లో వారు వాడే విప్ప. కానుగ. లాంటి నూనెల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉండడంతో వారి ఆరోగ్యానికి అవి శ్రీరామ రక్షగా నిలుస్తున్నాయని కచ్చితంగా చెప్పవచ్చు అన్నారు.

ఒకవేళ కరోనా వచ్చిన ఎలాంటి వైరస్ నై నా తట్టుకునే శక్తి వారిలో ఉంటుందని అన్నారు ఆయా గ్రామాల్లో 98 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయిందని వారు తెలిపారు…. ఆదివాసి ల్లో ఆచారం గా వచ్చిన సంస్కృతి సంప్రదాయాలు అందరిని అలరింప జేస్తున్నాయి జిల్లాలో అడవిని నమ్ముకొని బతుకీడుస్తున్న గొత్తి కోయ గిరిజన తెగలు నాగరికత సమాజానికి స్పూర్తిగా నిలుస్తున్నారు .కరోనా నేపథ్యంలో రెక్కాడితే డొక్కాడని శ్రమజీవులు చింతపండు నీళ్లు పచ్చిమిర్చి తో సారుచేసుకుని ఉన్నదే తింటూపొట్ట పోసుకుంటున్నారు.

.అటవీఫలాలు వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్నాయి. అడవిని నమ్ముకుని జీవిస్తున్న గొత్తి కోయలు చెట్టు పుట్ట బాగు చేసుకొని దుక్కి దున్ని తొలకరిలోకర్రే దా వరి వేసుకొని మందులు వేయకుండా పంట పండించుకుంటున్నారు.కరేదా ధాన్యం పెద్ద వరం లాంటిది మందులు వేయకుండా పండించే ఈదాన్యంమే కడుపు నింపేది ఎంతో బల పదార్థమైన కరేద ధాన్యం దంపుడు బియ్యం . నూకలు గా మార్చి అన్నం. జావా. కాసుకొని ఆరగిస్తారు

జొన్నలు మొక్కజొన్నలు సజ్జలు సామలు వంటి దాన్యాలతో జావా కాచుకుని కడుపు నింపుకుంటూ దృఢత్యానికి మారుపేరుగా నిలుస్తున్నారు ఇలాంటి ఆహారం తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తి అమితంగా ఉంటుందనిరోగాల బారినుండి తట్టుకునే శక్తి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు