సీఎం కెసిఆర్ పై కేసు నమోదు చెయ్యాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు!

ముఖ్యమంత్రి కెసిఆర్ పై వెంటనే కేసు నమోదు చెయ్యాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు!
తుంగతుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షులు దొంగ రీ. గోవర్ధన్.
తుంగతుర్తి ఫిబ్రవరి 5 నిజం న్యూస్.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ ఆంజనేయులు కి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై శనివారం ఫిర్యాదు చేశారు.
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ కేసీఆర్ రాజ్యాంగం పై అనుచిత వ్యాఖ్యలు చేయడం వలన భారతదేశ పౌరులుగా, రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంథం గా భావించే మా యొక్క మనోభావాలు తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా దేశాన్ని అస్థిరపరిచే విధంగా ఉన్నాయి.
దేశాన్ని అస్థిరపరిచే వ్యాఖ్యలు ఎవరు చేసినా, ఎవరు దేశ రాజ్యాంగానికి విధేయులుగా లేకపోయినా, ఎవరు రాజ్యాంగం పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా అట్టి వారిపై భారత రాజ్యాంగాన్ని అనుసరించి, భారత శిక్షా స్మృతి ని అనుసరించి దేశద్రోహం కేసు పెట్టి శిక్షించవలసిన అవసరం ఉంది అని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
కావునా భారత రాజ్యాంగం పై ఇటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు తిరుమల ప్రగడ కిషన్ రావు, యువజన కాంగ్రెస్ నాయకులు కొండరాజు, ఎల్లబోయిన శ్రీకాంత్ నాయుడు, అక్కినపల్లి నరేష్, ఉప్పుల రాంబాబు, కసన గొట్టు రాము, ఎండి అబ్దుల్, పెండెం శ్రీనివాస్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు*