అడవిని తలపిస్తున్న ఆర్డి4 కాలువ

ఈ ఏడాదైనా…. చివరి భూములకు సాగు నీరు అందే నా..!

అగమ్య గోచరంగా 4 వేల ఎకరాల రైతులు…

పట్టించుకోని అధికారులు…

అవస్థలు పడుతున్న రైతులు

చర్ల, మండలంలోని పెద్దమిడి సిలేరు మధ్యతరహా ప్రాజెక్టు పరిధిలోని ఆర్ డి4. కాలువ ప్రాజెక్టుకు గుండెకాయ లాంటిది ఈ కాలువ కింద కలివేరు నుండి తేగడ మేడి వాయి కొత్త గట్ల లింగాల ముమ్మడివరం వరకు నాలుగు కిలోమీటర్ల పొడవు గల కాలువ కింద సుమారు నాలుగు వేల ఎకరాలు రైతులువరి సాగు సేద్యం చేస్తున్నారు.  చివరి భూముల వరకు గత మూడు సంవత్సరాలుగా సాగునీరు అందక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తొలకరిలో చేయవలసిన పూడికతీత పనులు ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు చేపట్టకపోవడంతో కాలువ పిచ్చి మొక్కలు ముండ్ల పొదలు గడ్డి తో నిండి అడవిని తలపిస్తోంది.

ఈ విషయమై ప్రాజెక్ట్ అధికారులకు రైతులు పలుమార్లు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని రైతులుఆ వేదన వ్యక్తం చేస్తున్నారు చివరి భూములకు సాగునీరు అందకపోవడం ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యమే నని రైతులు ఆరోపిస్తున్నారు తొలకరి సమయంలో జెసిబి ద్వారా అరకొర పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారు అది కూడా కాలువ చివరి వరకు పనులు సాగడం లేదు దీంతో చివరి భూములకు నీరందక పంటలు ఎండిపోతున్నాయి రైతులు ప్రశ్నిస్తే నిధులు కొరత కారణంగా పనులు చేపట్టలేక పోతున్నామని అధికారులు సమాధానం ఇవ్వడం గమనార్హం ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపట్టి చివరి భూములకు సాగునీరు అందించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు