దక్కన్ సిమెంట్ సున్నపురాయి గని-III మైనింగ్ నిలిపివేతకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ

డెక్కన్ సిమెంట్స్ కు భారీ షాక్
సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం రావిపహాడ్ పరిధిలో గల దక్కన్ సిమెంట్ సున్నపురాయి గని-III మైనింగ్ నిలిపివేతకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ.
* సైదులు నామా రిజర్వ్ ఫారెస్ట్ కంపార్ట్మెంట్ నెంబర్ 26&27లోని 183.11(457.77ఎకరాలు) హెక్టార్లలో జరుగుతున్న చట్టవ్యతిరేక మైనింగ్ నిలుపుదలకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ తో కూడిన దిసభ్య ధర్మాసనం ఆదేశం.
* గని-II, గని-III లో జరిగిన చట్టవ్యతిరేక మైనింగ్ నకు అపరాధ రుసుము విదించాల్సిందిగా గతంలోని మైనింగ్ శాఖను ఆదేశిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు.ఎన్జీటీ ఉత్తర్వులను సమర్ధించిన హైకోర్టు.
* కామన్ కాజ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా(2017)కేసు ప్రకారం అపరాధ రుసుము వసూలుకు ఎన్జీటీ ఆదేశం.ఎన్జిటి ఉత్తర్వులపై అప్పీలుకు వెళ్ళని డెక్కన్ సిమెంట్స్.
* రూ.600 కోట్లు అపరాధ రుసుము విధించవచ్చునంటున్న ఫిర్యాదుదారుడు.
* సామాన్యుడి ఫిర్యాదుతో నిలిచిన డెక్కన్ సిమెంట్ మైనింగ్ కార్యకలాపాలు.
* ఇటీవలే 4.7MTPA సామర్థ్యంతో సిమెంట్ ప్లాంట్-III మరియు మైనింగ్ ఉత్పత్తి 2.3MTPA-4.6MTPA పెంపుదలకు ప్రజాభిప్రాయసేకరణ పూర్తి చేసిన డెక్కన్ సిమెంట్స్.కోర్టు ఉత్తర్వులతో నిలిచిన డెక్కన్ కార్యకలాపాలు.