సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంగిస్తే జైలుకే !

*సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంగిస్తే జైలుకే !!!*
*- సమాచారహక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తే ఈ క్రింది 167 , 220 ,219 , 407 , 408 సెక్షన్ల క్రింద సంబంధిత పౌర సమాచార అధికారి శిక్షకు బాధ్యులవుతారు….,…..
ఒక ఉద్యోగి విధి నిర్వహణలో ఎలా వ్యవహరించాలో నిర్దేశింపబడినప్పటికి సదరు ఉద్యోగి బుద్ధిపూర్వకముగా ఇతరులకు నష్టం కలగజేయవలననే సంకల్పంతో భిన్నంగా వ్యవహరిస్తే ఐపీసీ 166 ప్రకారం ఒక సంవత్సరం శిక్ష లేక జరిమానా లేక రెండూ విధించవచ్చు.
సమాచారహక్కు ఇవ్వమని చట్టం నిర్దేశించినా సమాచారం ఇవ్వకపోతే ఐపీసీ సెక్షన్ 166 ప్రకారం సంబంధిత అధికారి శిక్షార్హుడు. ఒక ప్రభుత్వ ఉద్యోగి బుద్ధిపూర్వకముగా చట్టములోని నియమాలను ఉల్లంఘించి లేక ధిక్కరించినా ఉద్యోగిని విధుల నుంచి తొలగించాలి.
ఆ వ్యక్తిని శిక్ష నుండి తప్పించుకునేటట్లుగా చేసినా ఆ నేరస్తునికి తక్కువ శిక్ష పడేటట్లు చేసిన ఐపీసీ 217 ప్రకారం శిక్షార్హుడు. ఇలా చేసినందుకు గాను 2 సంవత్సరాలు జైలుశిక్ష లేక జరిమానా లేక రెండు విధించవచ్చు. విధులు దుర్వినియోగపరిచినందుకు గాను అతన్ని విధుల నుంచి తొలగించకుండా జాలి చూపించినా, లంచం తీసుకొని రాజకీయ ఒత్తిళ్లు ఆ ఉద్యోగిని విధుల్లో కొనసాగించుట.
ఒక ప్రభుత్వోద్యోగి ఏదైనా రికార్డును తయారు చేయవలసిందిగా ఆదేశింపబడినప్పుడు ప్రజలను గాని లేదా ఎవరైనా వ్యక్తిని గాని నష్టపెట్టాలనే సంకల్పంతో బుద్ధిపూర్వకంగా రికార్డును తప్పుగా చేసినా లేక ఒక వ్యక్తి చట్టం బారినుండి శిక్ష పడకుండా రక్షించాలనే సంకల్పంతో రికార్డును తప్పుగా తయారు చేసినా, ఐపిసీ 218 ప్రకారం మూడు సంవత్సరాలు జైలు శిక్ష లేక జరిమానా లేక రెండూ విధించవచ్చు.ఒక వ్యక్తి ఆస్థిని మరొక వ్యక్తి పేరిట నకిలీ పత్రాలు సృష్టించుట, సంతకాలు పోర్టరీ చేసిన ఐపీసీ 420 ప్రకారం శిక్షార్హుడు. కొంత మంది అధికారులు రికార్డులు మార్పిడి చేసిన సందర్భాలున్నాయి.
*స.హ. చట్టం ద్వారా జరిగి యాదార్థ సంఘటన*
ఒక రైతు పేరిట ఉన్న భూమిని ఎటువంటి మ్యుటేషన్ లేకుండా మరొక్క రైతు పేరిట చేర్చితే, లేక సంబంధిత వ్యక్తులకు ఎప్పుడో పట్టాలు ఇచ్చినట్లు రికార్డులు సృష్టించుట, తాను చేసిన తప్పులు బయటపడతాయనే ఉద్దేశ్యంతో రికార్డులకు లేకుండా చేయుట చేస్తే ఐపీసీ 420 కింద వస్తుంది. దీనికి గాను ఏడు సంవత్సరాల శిక్ష విధించబడును.
దురాలోచన పూరితమైన కావాలనే ఉద్దేశంతో సమాచారం ఇవ్వకపోయినా ఐపీసీ 406 ప్రకారం రెండు సంవత్సరాలు లేక జరిమానా లేక రెండు విధించవచ్చు. ఏదైనా ఆస్థిని విధి నిర్వహణలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇతరులు పేరిట వ్రాయుట లేక అప్పగించుట, దుర్వినియోగం చేయుట, నమ్మక ద్రోహంగా భావించినా అట్టివారికి ఐపీసీ 409 ప్రకారం 10 సంవత్సరాల జైలుశిక్ష విధించవచ్చు.
*యాధార్థ సంఘటనలో బాగంగా* యదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా సఖీ సెంటర్, ఐసిడిఎస్ క్లస్టర్ ఆలేరు అధికార్లు ఆర్టిఐ దరఖాస్తులు వేసినందుకు వాళ్ళ అవినీతిని బయటకు తీసినందుకు ఆర్టీఐ కార్యకర్త పై దాడి , హత్యయత్న ప్రయత్నం చేయడం, తప్పుడు కేసు పెట్టడం, *మరోక సంఘటన* పెద్దపల్లి జిల్లాలో కల్లు గీత కార్మికుల కట్టే పన్నుల వివరాలు ఆర్టీఐ ద్వరా అడిగినందుకు గ్రామంలో కుల బహిష్కరణ చేయడం 2 లక్షల రూపాయల జరిమాన వేయడం కుటుంబాన్ని రెండుగా విడదీయడం చంపేస్తామని బెదిరించడం.
పెళ్లి కానివ్వకుండా చేస్తామని వచ్చే సంబధాలు చెడగొట్టడం , గ్రామ పంచాయితీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే నిధులు , హరితహరం అక్రమ కట్టడాలు , పారిశుద్ధ్యం , మౌలిక సౌకర్యలు , సమస్యలు , పథకాలు , గ్రామ అబివృద్ది ప్రజా ప్రయోజనాల నిమిత్తం వివరాలు ఆర్టీఐ దరఖాస్తు ద్వారా అడినందుకు కుట్రపూరితంగా దాడి చేయించి తప్పుడు కేసులో ఇరికించడం. ఇలా అవినీతి అధికారులు , ప్రజా ప్రతినిధులు చేస్తున్నారు . కానీ చట్టం నుంచి ఎప్పటికీ వీరు తప్పించుకోలేరు అనే విషయాన్ని విస్మరిస్తున్నారు.