ఆర్.ఐ ను బదిలీ చేయాలంటూ కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన సర్పంచ్

**ఆర్.ఐ ను బదిలీ చేయాలంటూ కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన సర్పంచ్*

పాలకీడుజనవరి 2(నిజం న్యూస్ ):మండలం ఆర్.ఐ జానీ పాషా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని అతనిని ఈ మండలం నుండి మరో చోటకు బదిలీ చేయాలంటూ జానపహాడ్ దర్గా సర్పంచ్ గోరి బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు .

ఫిర్యాదు పత్రం లో పాలకీడు మండలం ఆర్.ఐ జానిపాషా రెవెన్యూ కార్యాలయంకు ఎదో ఒక పని కోసం వచ్చిన ప్రజల నుండి ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి ముక్కు పిండి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు..

కార్యాలయం లో పని కోసం వచ్చిన వారికి కనీసం గౌరవించకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు..

అంతే కాకుండా జాన్ పహాడ్ దర్గా ఉర్సు సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన రంగుల రాట్నం యజమాని వద్ద 20 వేలు, దర్గా అధికారుల వద్ద 25 వేల రూపాయలు.. దర్గా కాంటాక్టర్ వద్ద 25 వేల రూపాయలు వసూళ్లకు పాల్పడ్డారని పేర్కొన్నారు..

అంతే కాకుండా ఆర్.ఐ జానిపాషా కింది స్థాయి ఉద్యోగుల పై అనుచిత వ్యాఖ్యలు చేయడం వారిని కొట్టడం జరుగుతోందని ఆరోపించారు..

ఆర్.ఐ జానీ పాషా ఆగడాలకు అంతం లేకుండా పోయిందని ఇసుక మాఫియా దారులకు బాస్ గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు..

అవినీతి అక్రమాలకు పాల్పడుతోన్న ఆర్.ఐ జానీ పాషా ను తక్షణమే పాలకీడు మండలం నుండి బదిలీ చేయాలని అంతే కాకుండా ఆయన అవినీతి పై బహిరంగ విచారణ చేపట్టాలని కోరారు..