నాలుగు దేవాలయాలకు 48 లక్షల నిధులు మంజూరు
నాలుగు దేవాలయాలకు నిధులు మంజూరు
వేములవాడ, ఫిబ్రవరి02 (నిజం న్యూస్):
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని 4 దేవాలయాల నిర్మాణాలకి సీజీఎఫ్ గ్రాంట్ ద్వారా 48 లక్షల నిధులు మంజూరు శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి గురువారం ధన్యవాదాలు తెలిపారు. వేములవాడ గ్రామీణ మండలం లింగంపల్లి గ్రామంలోని హనుమాన్ టెంపుల్ నిర్మాణానికి రూ 12 లక్షలు, నమిలిగుండుపల్లిలో బీరప్ప స్వామి టెంపుల్ నిర్మాణానికి రూ 12 లక్షలు, పట్టణంలో మడేలేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణానికి రూ 12 లక్షలు, చందుర్తి మండలం కట్టలింగంపేట గ్రామంలో పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి రూ 12 లక్షలు మొత్తంగా 48 లక్షలు మంజూరీ అయ్యాయి. దేవాలయాల నిర్మాణానికి కావలసిన గ్రాంటును కట్టి దేవాలయాల కమిటీ మెంబర్లు, గ్రామస్తులు ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు దృష్టికి తీసుకురాగా వారు సీజీఎఫ్ నిధుల మంజూరీ కొరకు దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి లేఖను సమర్పించారు. మంత్రి శాసనసభ్యుల లేఖను సీ.జీ.ఎఫ్ కమిటీకి సిఫారసు చేశారు. సీ.జీ.ఎఫ్ కమిటీ శాసనసభ్యులు రమేష్ బాబు ప్రతిపాదనను ఆమోదించి దేవాలయాలభివృద్ధి నిర్మాణానికి ప్రొసీడింగ్ నెంబర్/11469|2021-3 తేదీ 06.01.2022 ద్వారా పై దేవాలయాల నిర్మాణానికి రూ 48 లక్షలు మంజూరీ చేశారు. నిధులు మంజూరీ చేయించిన శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబుకు దేవాలయాల కమిటీ మెంబర్లు, గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు