దశ దిశ లేని దౌర్భాగ్య బడ్జెట్ ఇది…సిఎం కెసిఆర్
డబ్బాలో రాళ్లు వేసి ఊపినట్లుగా ఉంది
గోల్‌మాల్ గోవిందం లాగా బడ్జెట్ ప్రకటను
దేశాన్ని గట్టెక్కించే ఊసేలేని కేటాయింపులు
బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు తీరని అన్యాయం
రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు ద్రోహం
ఉద్యోగులకు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసింది
లాభాల్లో ఉన్న ఎల్ª`ఐసి లాంటి సంస్థలను ఎలా అమ్ముతారు
నదుల అనుసంధానం పేరుతో మోసం చేసే యత్నం
75ఏళ్ల స్వాతంత్య్రం తరవాత కూడా దౌర్భాగ్య పరిస్థితులు
కడు సంకుచిత స్వభావంతో బిజెపి ప్రభుత్వం ఉంది
ఇదో దిక్కుమాలిన ప్రభుత్వంగా నిరూపించుకుంది
బిజెపిని బంగాళాఖాతంలో పడేస్తే తప్ప నిష్కృతి లేదు
విూడియా సమావేశంలో మండిపడ్డ సిఎం కెసిఆర్
హైదరాబాద్,ఫిబ్రవరి1(ఆర్‌ఎన్‌ఎ): దేశంలో ఉన్న వనరులను కూడా వాడుకోలేని దౌర్భాగ్య స్థితిలో కేంద్రం ఉందని…బడ్జెట్ కేటాయింపులు చూస్తుంటే ప్రభుత్వానికి దశదిశ లేదని తెలుస్తోందని స్పష్టం అయ్యిందని, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ డల్లా..డొల్ల..గుండుసున్నా అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శిం చారు.
ఇంతటి దౌర్భాగ్ పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఇంకా భవిష్యత్ దార్శనికత లేని విధానాలతో ఉందనడానికి ఈ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ చక్కని ఉదాహరణ అన్నారు.
ఏ రంగంలో కూడా దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్లాలన్న భావన లేదన్నారు. ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం మరోటి ఉండదన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై స్పందించిన కేసీఆర్… కేందప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
బాధతో ఆక్రోశంతో తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని అన్నారు. కేంద్రంలో తెలివి తక్కువ ప్రభుత్వం ఉంది.. ఘోరమైన పద్దతిలో దేశాన్ని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళవారం ప్రగతి భవన్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై విూడియాతో సిఎం కేసిఆర్ మాట్లాడుతూ..ఆర్థికమంత్రి దారుణమైన బడ్జెట్ ప్రవేశపెట్టారు.
కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. విూడియా సమావేశంలో మంత్రులు హరీష్ రావు, మహ్మూద్ అలీ, సత్యవతి రాథోడ్,తలసాని తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ మోడీ గుజరాత్‌కు ప్రధానిగా మాత్రమే ఉన్నారని మండిపడ్డారు. ఆయన దృష్టి అంతా గుజరాత్ నుంచి బయటకు రావడం లేదన్నారు. బడ్జెట్ తీరు చూస్తుంటే తీవ్ర ఆవేదన కలుగుతోందన్నారు.
ఉపాధిహావిూ పథకానికి 30వేలకు పైగా కోత పెట్టారని మండిపడ్డారు. వ్యవసాయం, ఎరువులు, నరేగా సబ్సీడీ తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఎవరి కోసం ఉందన్న ఆలోచన ప్రజలు చేయాలన్నారు.
ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి మెదడు ఉన్నట్టా? లేనట్టా? అని ఘాటుగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పాలసీ వెరీ బ్యాడ్ పద్ధతిని అవలంబిస్తోంది. 38 కోట్ల జనాభా ఉండే ఎస్సీ, ఎస్టీలకు 15వేల కోట్లు. తెలంగాణలో దళితుల కోసం 33వేల కోట్లు కేటాయించాం. బీజేపీకి దళితులు` గిరిజనుల పట్ల శిత్తశుద్ధి బడ్జెట్ చుస్తే అర్థం అవుతుందన్నారు. రైతులకు ప్రధాని క్షమాపణ చెప్పారు. కానీ
ఇవ్వాళ వ్యవసాయ రంగానికి సరైన కేటాయింపులు లేవన్నారు. యూరియాపై సబ్సిడీ 12వేలు, ఇతర ఎరువులపై 20వేలకు పైగా తగ్గించారని కేసీఆర్ తెలిపారు. బడ్జెట్‌లో అందరికీ గుండుసున్న. కేంద్ర బడ్జెట్ పైన పటారం.. లోన లోటారం అన్నట్లుగా డబ్బాల రాళ్లు వేసి ఊపినట్లుగా ఉందన్నారు.
ఈ ప్రభుత్వం ఎవరి కోసం ఉన్నట్లు?. బడ్జెట్ ప్రవేశ పెడుతూ మహాభారతంలోని శాంతిపర్వం శ్లోకాన్ని నిర్మల చెప్పారు.. ప్రవచించింది అధర్మం, అసత్యం అన్నారు. సాగు చట్టాల ఉద్యమంలో మరణించిన రైతుల గురించి బడ్జెట్ లో కనీసం ప్రస్తావించలేదు. వ్యవసాయరంగానికి జీరో బడ్జెట్. పైగా ఎరువుల విూద రూ.35వేల కోట్ల సబ్సీడి తగ్గించారు. విద్యుత్ సంస్కరణలంటూ మెంటల్ కేసు పట్టుకున్నారు.
రైతుల నుంచి విద్యుత్ ఛార్జీలు చేయాలన్నదే అసలు సంగతి. ఎస్సీల జనాభాపై కేంద్రం చెబుతున్న లెక్కలు తప్పు. దేశంలో ఎస్సీ, ఎస్టీల జనాభా చాలా పెరిగింది. దిక్కుమాలిన గుజరాత్ మోడల్ అడ్డం పెట్టుకుని నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు. కరోనా సమయంలో ఈ ప్రభుత్వం ఎంత దరిద్రంగా వ్యవహరించిందో చూశాం.
పవిత్రమైన గంగానదిలో శవాలు తేలేలా చేసిన ప్రభుత్వమిదని మండిపడ్డారు. కేంద్రం నిస్సిగ్గుగా ఎల్‌ఐసీని అమ్ముతోందని, ఎందుకు అమ్ముతోందని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
నష్టం వస్తే అమ్మాలి కాని లాభాల్లో నడుస్తున్న ఎల్‌ఐసీని ఎందుకు అమ్ముతున్నారని నిలదీశారు. బ్యాంకులను ముంచిన వారంతా హ్యాపీగా విదేశాల్లో ఉన్నారని తెలిపారు. ప్రపంచ హంగర్ ఇండెక్స్‌లో 101 స్థానంలో ఉన్నాం.అడ్డగోలుగా మాపై మాట్లాడుతున్నారు.. కూకటివెళ్లతో పెకిలిస్తాం.
వెరీ షార్ట్ సైటెడ్ మన ప్రధాని. ఈ ప్రభుత్వం ఎవరికోసం ఉన్నట్టు. ఆర్బిట్రేషన్ సెంటర్‌ను అడ్డుకునేందుకు మోదీ కుట్రచేశారు. ఈ కేంద్రాన్ని అహ్మదాబాద్‌కు తరలించాలని చూశారు. సంకుచితమైన బుద్ధికలిగిన కేంద్ర ప్రభుత్వం ఉన్నందుకు సిగ్గుపడుతున్నాం. కేంద్రం చెప్పేదంతా అబద్ధమే.
క్రిప్టో కరెన్సీని ఒప్పుకున్నారా?. అని కేసీఆర్ ప్రశ్నించారు. అలాంట ప్పుడు 30శాతం పన్ను వేస్తామని ఎలా అంటారని అన్నారు. కేంద్ర బడ్జెట్ దారుణంగా ఉందని, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని మండిపడ్డారు.
గంగానదిలో శవాలు తేలేలా చేసిందని ఆరోపించారు. గంగానదిలో ఈస్థాయిలో శవాలు తేలడం తానెప్పుడూ చూడలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశంలో బీజేపీ పాలన ఎలా ఉందంటే.. దేశాన్ని అమ్మడం, మతపిచ్చి పెంచి ఓట్లు సంపాదించుకోవడమని కేసీఆర్ విమర్శించారు.
ఇప్పటికే ఎయిరిండియాను అమ్మేశారని, ఎల్‌ఐసీని కూడా అమ్ముతామని బడ్జెట్లో నిసిగ్గుగా చెప్పారని కేసీఆర్ ఆరోపించారు. లాభాల్లో ఉన్న ఎల్‌ఐసీని ఎలా అమ్ముతారని ఆయన ప్రశ్నించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని? పెట్టుబడి రెట్టింపు చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం ఇది అని ఎద్దేవా చేశారు.
బడ్జెట్లో నదుల అనుసంధానం మిలీనియం జోక్ అని కేసీఆర్ అభివర్ణించారు. ఏ ప్రాతిపదిక లేకుండా ఎలా ప్రకటిస్తారని అన్నారు. దేశంలో ఇంకా 35 వేల టిఎంసిల నీరు వీధా అవుతోందని…అయినా మంచినీటి కటకటలు తప్పడం లేదన్నారు. ఈ ప్రభుత్వానికి నీటి పాలసీ, కరెంట్ పాలసీ లేదన్నారు.
బీజేపీని కూకటివేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో పారేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. అప్పుడే దేశానికి శాంతి అన్నారు. బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
బడ్జెట్ ప్రసంగం ఆసాంతం డొల్లతనంతో నిండి, మాటలగారడీతో కూడి వున్నదని అని సీఎం పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంతమ జబ్బలు తామే చరుచుకుంటూ, సామాన్యులను నిరాశా నిస్పృహలకు గురిచేస్తూ , మసిపూసి మారేడు కాయ చేసిన గోల్ మాల్ బడ్జెట్ గా కేంద్ర బ్జడెట్‌ను సీఎం అభివర్ణించారు. వ్యవసాయ
రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యమని సీఎం అన్నారు. దేశ చేనేత రంగానికి ఈ బడ్జెట్ సున్నా చుట్టిందన్నారు. నేతన్నలను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఉద్యోగులను చిరు వ్యాపారులను బ్జడెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు.
ఇన్‌కంటాక్స్‌లో స్లాబ్స్ ను ఏవిూ మార్చకపోవడం విచారకరమని సీఎం అన్నారు. ఆదాయపన్ను చెల్లింపులో స్లాబుల విధానం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగ వర్గాలు, తదితర పన్ను చెల్లింపుదారులు చకోర పక్షుల్లా ఎదురు చూసారని , వారి ఆశలవిూద కేంద్ర నీళ్లు చల్లిందన్నారు. వైద్యం తదితర ప్రజోరోగ్యం , మౌలిక రంగాలను అభివృద్ధి పరడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విషయం ఈ బ్జడెట్ ద్వారా తేట తెల్లమైందన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కష్టకాలంలో హెల్త్ ఇన్‌ఫ్రాస్టక్చర్ర్‌ను అభివృద్ధి పరుస్తుంటే.. ఆ దిశగా కేంద్రానికి సోయి లేకపోవడం విచారకరమని సీఎం పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో దేశ వైద్య రంగాన్ని అభివృద్ధి పరచడం మౌలిక వసతుల పురోగతికి చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టలేదన్నారు. దేశ ప్రజల ఆరోగ్యం కేంద్రానికి పట్టకపోవడం విచిత్రమని ముఖ్యమంత్రి ఆశ్యర్యం వ్యక్తం చేశారు.