సమాచారం అడిగితే తప్పుడు కేసులా ?
– ఆర్టీఐ కార్యకర్తలకు రక్షణ ఏది?
– సమాచార కార్యకర్త మాతంగి యేసుబాబు
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 01 (నిజం న్యూస్)
సమాచారం అడిగితే తప్పుడు కేసులు పెడుతూ ఆర్.టి.ఐ దరఖాస్తుదారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. యాదద్రి భువనగిరి జిల్లా,జిల్లా సంక్షేమ అధికారి,ఐసీడీఎస్ క్లస్టర్ ఆలేరు పతాధికారి,మరియు వీరి కార్యాలయ సిబ్బంది తప్పుడు సమాచారం ఇస్తు సమాచార కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడుతూ వారి స్వార్థ ప్రయోజనాల కోసం అమయాకులను బలి చేస్తున్నారు.
వీరి కార్యాలయం లో పనిచేస్తే ఎవరైనా ఉంటే వీరు తప్పించు కోవడం కోసం కొంతమంది అధికారులతో చేతులూ కలిపి వారు అధీనంలో ఉన్న సఖి కేంద్రం, ఉపయోంచుకొని వారి అధికార బలంతో సమాచార కార్యకర్తలను బలిచేస్తున్నారు. సమాచార చట్టం ప్రకారం సమాచారం అడిగే హక్కు వుంది కానీ వీరు సమాచారం ఇస్తే దొరికి పోతమనే ఉద్దేశంతో రాజకీయ నాయకులతో చేతులూ కలిపి కార్యకర్తల ఇంటి మీదకు వచ్చి దాడులు, హత్యాప్రయత్నాలు చేయించుతున్నారు.
గొడవలకు పురిగొల్పుతున్నారు. ఇంకా అధికారులు సమాచార కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడితే తప్పించుకోడానికి ప్రయత్నం చేస్తున్నారు.జిల్లా పరిధిలో ఉండవలసిన అధికారులు స్థానికంగా లేకున్నా స్థానికంగా ఉన్నట్టుగా చిత్రీకరించుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.ఇలాంటి వారిపై జిల్లా పరిపాలన అధికారులు చర్యలు తీసుకోకపోవడం శోచనీయం.
తప్పుడు బోగస్ సర్టిఫికేట్ సృష్టించి కొన్ని ప్రైవేట్ స్కూల్లో తప్పుడు బోనఫైడ్ తెచ్చుకొని ఉద్యోగం చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోలేకపోవడం,తప్పుడు సెలక్షన్ తో రాజకీయ పైరవీలతో అర్హులైన ఉద్యోగులు అనర్హులైన వారికి కట్టబెట్టి తప్పు చేస్తు, అధికారులు సమాచార కార్యకర్తలు సమాచారాన్ని అడగడతే సమాచారం లో సెలక్షన్ ఫైల్ మిస్సింగ్ అయిందని, ఫైలు చెదలు పట్టిందని, ఫైల్ లు పాడైపోయినని, ఒక సెలక్షన్ ఫైలు పోయిందా?మిగతా ఫైలు కూడా చెదలు పట్టినవని, పోయినవని తప్పుడు నివేదికలు వీరందరూ మూకుమ్మడిగా సమాచార కార్యకర్తలు అందిస్తున్నారు.
తప్పుడు కేసులు కూడా పెడుతున్నారు. సమాచార కార్యకర్తలను ఫోను చేసి బెదిరిస్తున్నారు. దాడులు చేస్తాం అంటున్నారు. పబ్లిక్ యాక్ట్ ప్రకారం రికార్డులను 25 సంవత్సరాలు భద్రపరచాలని అధికారులకు తెలువదా?తెలిసిన వాళ్ల స్వార్థప్రయోజనాల కోసం చూసి చూడనట్టుగా వుంటున్నారు. ఇట్టి విషయం పైన ఉన్నతాధికారులు చొరవ చూపి సంబంధిత బాధ్యుల మీద చర్యలు తీసుకోగలరని పత్రికా ముఖంగా అధికారులను మాతంగి యేసుబాబు డిమాండ్ చేశారు.