సైన్యానికి 117ఎకరాల విరాళం…ఖండించిన హీరో సుమన్

భారత సైన్యానికి 117ఎకరాల భూమిని విరాళంగా సుమన్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం.
ఖండించిన హీరో సుమన్.
ప్రముఖ నటుడు సుమన్ భారత సైన్యానికి 117ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ భూమిని విరాళంగా అందించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘117 ఎకరాల భూమిని తాను భారత సైన్యానికి ఇచ్చినట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఆ భూమికి సంబంధించిన వివాదం ఇంకా కోర్టులో ఉంది. వివాదం పరిష్కారం అయిన వెంటనే స్వయంగా తానే అందరికీ తెలియజేస్తాను’ అంటూ అంటూ చెప్పుకొచ్చారు.