మాటల గారడి‌గా కేంద్ర బడ్జెట్..ఎమ్మెల్సీ గుత్తా

– శాసన మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఒట్టి మాటల గారడి బడ్జెట్‌గా ఉందని తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్య ప్రజల నడ్డివిరిచేలా ఉందని ఆయన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు, దేశ రైతాంగానికి, కుల వృత్తిల వారికి, ఉద్యోగులకు ఈ బడ్జెట్ నష్టం చేసేలా ఉందన్నారు.

ముఖ్యంగా దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగాన్ని ప్రోత్సాహించే ఆలోచన కేంద్రానికి ఉన్నట్లుగా లేదని ఈ బడ్జెట్ ద్వారా అర్థం అవుతుందని ఆయన చెప్పారు.

ప్రపంచ దేశాలు ఆరోగ్య రంగానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చి తమ ప్రజలను కాపాడుకొనేందుకు అధిక నిధులను ఖర్చు చేస్తుంటే.. మన కేంద్ర ప్రభుత్వం మాత్రం హెల్త్ సెక్టార్ కి తక్కువ నిధులను కేటాయిస్తూ ప్రజలను ఇబ్బదులకు గురి చేసే విధంగా ఉందని గుత్తా చెప్పారు.

ప్రస్తుత కేంద్ర బడ్జెట్ ని కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారని సుఖేందర్ రెడ్డి అన్నారు