Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సిబిఎస్ నుండి ఎంజిబిఎస్ వరకు ఉచిత బగ్గీ రైడ్ ..!

సిబిఎస్ నుండి ఎం జి బి ఎస్ వరకు ఉచిత బగ్గీ రైడ్!

టీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో సజ్జనార్ ఉచిత వినూత్న నూతన పథకం.

సజ్జనార్ కు జేజేలు పలుకుతున్న వృద్ధులు, ప్రయాణికులు.

హైదరాబాద్ ,ఫిబ్రవరి 1 నిజం న్యూస్.

వృద్ధులకు ,ప్రయాణికులకు మెరుగైన ఉచిత సేవలు అందించే లక్ష్యంతో టిఎస్ఆర్టిసి ఆధ్వర్యంలో నూతన చైర్మన్ గా సజ్జనార్ పదవీ బాధ్యతలు చేపట్టిన తరుణంలో.. హైదరాబాదులో పాత సిబిఎస్ బస్ స్టేషన్, నిత్యం ఎం జి బి ఎస్ ఆవరణలో ప్రయాణికుల రద్దీ గా ఉంటూ, తమ బ్యాగులను మోయలేని స్థితిలో, కనీసం ఆటో రమ్మని అడిగిన, డబ్బులు ఇస్తామన్నా, సమయానుకూలంగా రాకపోవడంతో , ప్రయాణికుల కష్టాలు పడుతున్నారు. దీనితో ప్రయాణికుల కష్టాలు తన మనసులో ఎరిగి తక్షణమే యుద్ధప్రాతిపదికపై 12 మంది ప్రయాణికులు కూర్చునే విధంగా, ఒక ప్రత్యేకమైన బగ్గీ నీ అందుబాటులోకి తెచ్చి, ప్రత్యేక డ్రైవర్ శిక్షణతో తర్ఫీదు ఇచ్చి, ఉచిత సౌకర్యాన్ని కల్పించిన ఘనత సజ్జనార్… సార్ కె దక్కిందని చెప్పవచ్చు…. ప్రతిరోజు ఉదయం 6:00 మొదలుకొని రాత్రి 12 గంటలకు వరకు వందల ట్రిప్పులు వేసి, ఉచితంగా ప్రయాణికుల కోసం మెరుగైన సేవలు అందిస్తున్న దిగాను, వృద్ధులు, వికలాంగుల ప్రయాణికులు సజ్జనార్ కు జేజేలు పలుకుతూ, ఆర్టీసీని బలోపేతం చేయవలసిన బాధ్యత ప్రతి ప్రయాణికులపై ఉందని నిజం న్యూస్ తో తెలిపారు.