పసునూరు ఎస్సీ కాలనీకి మిషన్ భగీరథ నీళ్లు రానట్లే నా…?

ఎస్సీ కాలనీ కి యుద్ధప్రాతిపదికపై మిషన్ భగీరథ మంచినీళ్లు, పంపిణీ చేయాలని కాలనీవాసులు డిమాండ్.
నాగారం, ఫిబ్రవరి 1 నిజం న్యూస్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు పంపిణీ చేసే ఉద్దేశంతో, కోట్లు ఖర్చు చేసి ఎంతో ప్రణాళికతో చేసిన ప్రత్యేకంగా పథకంగా చెప్పుకోవచ్చు.
ప్రతిఇంటికి పరిశుభ్రమైన నీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకోని,అందరు మినరల్ నీళ్లు కొనుకొచ్చుకొని తాగలేరు అనే భావనతో మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈపథకం మాత్రం , పసునూర్ లో మాత్రం నోచుకోలేదు,ఊర్లో అన్ని ప్రాంతాలకు ఇస్తున్నారు కానీ ఒక ఎస్సి కాలనికి(మాదిగ)మాత్రమే ఈ మిషన్ భగీరథ నీళ్లు సప్లై కావాట్లేవు. అంతేకాదు ఇంకా చాలా ఇండ్లకు ఈ నల్లా కలెక్షన్స్ కూడ ఇవ్వలేదు.ఇదేవిషయంపై నేనుచాలసార్లగ్రామసభలో కూడ గ్రామపెద్ద అయినప్రెసిడెంట్(సర్పంచ్),అధికారుల దృషికి కూడా తీసుకెళ్లాం.ఈవిషయంలో పాలకుల నిర్లక్ష్యం అనుకోవాలా?అధికారుల అలసత్వం అనుకోవాలో అర్థం కావట్లేదు
.ఈవిషయం గురించి నిజం న్యూస్”తో పసునూర్ గ్రామ పంచాయితీ సభ్యులు మాల్లెపాక సందీప్, మిషన్ భగీరథ నీటి సమస్య గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఏది ఏమైనా యుద్ధప్రాతిపదికపై మిషన్ భగీరథ అధికారులు గ్రామములో చిన్న చేసి తక్షణమే సౌకర్యం కల్పించాలని కాలనీవాసులు, పంది శీను మల్లెపాక శీను మల్లెపాక రవీందర్ పత్తేపురం ఎల్లయ్య మల్లె పాక దుర్గయ్య మల్లెపాక సత్తయ్య నరాల అశోక్ తదితరులు పాల్గొన్నారు ఈవిషయంలో పాలకులు గాని అధికారులు కానీ సత్వరమే పనులు చేయకపోతే మిషన్ భగీరథ కార్యాలయం ముందు ప్రజలచే ధర్నాలు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.