నిర్లక్ష్యం వహిస్తే పబ్ ల లైసెన్స్ లను రద్దు చేస్తాం

రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని టూరిజం ప్లాజా హోటల్ లో పబ్ యజమానులు, ఆబ్కారీ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించాలనే లక్ష్యం తో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గంజాయి, డ్రగ్స్ లపై ఉక్కుపాదం మోపాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం లో గంజాయి, డ్రగ్స్ నిర్ములనే లక్ష్యం గా అధికారులు కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. పబ్ లలో డ్రగ్స్ వినియోగం జరగకుండా పబ్ యజమానులే బాధ్యత వహించాలని మంత్రి ఆదేశించారు.
డ్రగ్స్ వినియోగం పై పబ్ యజమానులు నిర్లక్ష్యం వహిస్తే వారి లైసెన్స్ ను రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో గంజాయి సాగుచేసే రైతుల భూముల వివరాలు సేకరించి వారి భూములకు రైతు బంధు రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గంజాయి, డ్రగ్స్ ల వాడకం దారులపై PD కేసులు, బైండోవర్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ నగరం బ్రాండ్ కు ఇబ్బందులు రాకుండా పబ్ యజమానులు బాధ్యత గా ఉండాలన్నారు. పబ్ లలో సౌండ్ ప్రూఫ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇతరులకు సౌండ్ పొల్యూషన్ వల్ల చుట్టూ పక్కల వారికి ఇబ్బందులు కలగకుండా పబ్ లను నిర్వహించుకోవలని మంత్రి సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఉన్నతాధికారులు అజయ్ రావు, డేవిడ్ రవికాంత్, చంద్రయ్య, సత్యనారాయణ, అరుణ్ కుమార్, శీలం శ్రీనివాసరావు, రవీందర్ రావు పాల్గొన్నారు.