ఎర్రంపాడు మార్గంలో ల్యాండ్ మైన్స్ నిర్విర్యం

పోలీసులను హతమార్చడమే లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం-ఈస్ట్ గోదావరి కమిటీ సెక్రెటరీ ఆజాద్ ఆధ్వర్యంలో మధు, రజిత, బాలు, రాందాస్, రాజేష్ లు బత్తినపల్లి నుండి ఎర్రంపాడు మార్గంలో ఏర్పాటు చేసిన ల్యాండ్ మైన్స్ ను భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు నిర్విర్యం చేయడం జరిగింది అన్నారు. ఈ విధంగా మావోయిస్టు పార్టీ ఏజెన్సీ ప్రాంత సామాన్య ప్రజల ప్రాణాలకు హాని తలపట్టే విధంగా ఏర్పాటు చేసిన ల్యాండ్ మైన్స్ మరియు బూబి ట్రాప్ర్స్ ను కనుగొనడంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. నిషేధిత మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాల పట్ల ఏజెన్సీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వారికి ఎలాంటి సహాయ సహకార్యాలు అందించవద్దని కోరారు