నూతన గోదాం లోకి ఈవియం లు తరలింపు
నూతన గోదాం లోకి ఈవియం లు తరలింపు.
అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు.
సూర్యాపేట జనవరి 31( నిజం న్యూస్)
నూతన కలెక్టరేట్ ఆవరణలో నిర్మించిన గోదాం లోకి ఈవియం లు, ఎన్నికల సామగ్రి తరలించడం జరిగిందని అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సోమవారం రోజున స్థానిక వ్యవసాయ మార్కెట్ గోడమ్ లో గల ఎలక్షన్ పిటిషన్ లో లేనటువంటి బ్యాలెట్ యూనిట్స్ 1288, కంట్రోల్ యూనిట్లు 44, వివి ఫ్యాట్స్ 1332 మొత్తం 2664 గల ఎన్నికల పరికరములు కుడకుడ లోని నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన ఈవియం ల గోదాంలోకి ఆర్టీసీ డి.జి. టి. బస్సులో పోలీస్ బందోబస్తు తో పకడ్బందీగా తరలించడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ రాజేంద్ర కుమార్, ఆర్.డి.ఓ లు కోదాడ కిషోర్ కుమార్, హుజూర్ నగర్ వెంకా రెడ్డి, ఏ.ఓ శ్రీదేవి, తహసీల్దార్ వెంకన్న, ఎలక్షన్ డి.టి.లు, సిబ్బంది, వివిధ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.