డ్రగ్స్ తీసుకెళ్తున్న ముగ్గురు అరెస్టు

విశాఖపట్నం: డ్రగ్స్ తీసుకెళ్తున్న ముగ్గురిని ఎయిర్‌పోర్టు పోలీసులు ఎన్‌ఎడి జంక్షన్‌లో అరెస్టు చేశారు. ముగ్గురిలో ఒక మహిళ హైదరాబాద్‌కు చెందినది కాగా, మరో ఇద్దరు విశాఖపట్నంకు చెందిన వారు. నిందితులను గంటా మాలవ్య, లంక వెంకట హేమంత్ కుమార్ అలియాస్ హేమంత్, ఉప్పలపాటి పృద్వీ రాజుగా గుర్తించారు. కాగా, ఈ కేసులో ప్రమేయం ఉన్న కిలారి గీతాంజలిని ఇంకా అరెస్టు చేయలేదు. నిందితుల నుంచి 18 ఎన్‌ఎండీఏ ట్యాబ్లెట్లు, రెండు చిన్న ప్యాకెట్లు ఎండీ క్రిస్టల్ పౌడర్, కారు, మూడు మొబైల్ ఫోన్ల నగదు రూ.20,500 స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.