తాళ్ల గడ్డ లో కబ్జాకు గురవుతున్న భూములను కాపాడాలి
కబ్జాకు గురవుతున్న భూములను కాపాడాలి.
తక్షణమే రెవిన్యూ మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు స్పందించాలి.:కాంగ్రేస్ మున్సిపల్ ప్లోర్ లీడర్ బిఎల్ఆర్.
మిర్యాలగూడ జనవరి 30.(నిజంన్యూస్): భూ కబ్జా ల గురించి వచ్చిన వార్తల పై మిర్యాలగూడ తాళ్ల గడ్డ లోని ఇందిరమ్మ కాలనీ మరియు సర్వే నెంబర్ 519 లను స్థానిక ప్రజల ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పరిశీలించారు. తక్షణమే రెవిన్యూ మున్సిపల్,ఇరిగేషన్ అధికారులు మరియు కబ్జాకు గురవుతున్న భూములను కాపాడాలని పట్టాదారుని అధికార పార్టీ నాయకులు లు బెదిరించడం వారికి అధికారులు సహకరించడం తీవ్రంగా ఖండిస్తున్నామని తక్షణమే వీటిపై చర్య తీసుకోవాలని లేని ఎడల కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని ప్రభుత్వ భూమిని కాపాడుతూ పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేసినారు.అధికార పార్టీ నాయకులు చింతపల్లి ఇందిరమ్మ కాలనీలో మరియు రాళ్ల గడ్డ లోని ఇందిరమ్మ కాలనీలో 56 57 58 59 సర్వేనెంబర్ లో గల భూములకు చెరువు హద్దు రాళ్లను మార్చిన కబ్జాదారుల పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అక్రమాలకు పాల్పడిన అధికారులు మరియు కబ్జాకార్లపై చర్య తీసుకోబడుతుంది అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ గంధం రామకృష్ణ మాజీ కౌన్సిలర్ బంటు లక్ష్మీనారాయణ కోడిరెక్క ఇంద్రకుమార్ బంటు శ్రీనివాస్ వేణు కలీం,ఘఫూర్ ,పెద్దిశ్రీను, నుస్రత్ అలి కాలనీవాసులు పాల్గొన్నారు