ముoడ్లపాడు గ్రామ శివారులో క్షుద్రపూజలు కలకలం

కృష్ణా, జనవరి 30, (నిజం న్యూస్)
పెనుగంచిప్రోలు మండలం ముoడ్లపాడు గ్రామ శివారులో రహదారి పక్కన పంటపొలాల మధ్య క్షుద్రపూజలు కలకలం రేగింది, అర్థరాత్రి క్షుద్రపూజలు చేశారనే భయం ఒక్కసారిగా నెలకొన్నది. చిందర వందరగా పడి ఉన్న కలర్ రంగు నిమ్మకాయలు, మహిళావస్త్రాల
ఆనవాళ్లు తో గ్రామస్తులలో అలజడి నెలకొంది.ఈ నేపథ్యంలో గ్రామ పొలిమేరలో జరిగినటువంటి క్షుద్ర పూజ అనేటటువంటి వార్త అవాస్తవమని ముళ్లపాడు గ్రామ వి ఆర్ ఓ పి. శ్రీనివాసరావు పాత్రికేయులకు తెలియజేశారు. స్తల సంఘటనను పరిశీలన చేయగా నవాబుపేట గ్రామస్తులు ప్రతి సంవత్సరం అమ్మవారికి జాతర కార్యక్రమం నిర్వహించికుంటారని, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులను కూడా పిలిచి భోజనం పెట్టినట్లు వారు తెలియజేశారన్నారు. ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని పెనుగంచిప్రోలు మండలం తాసిల్దార్ ఒక ప్రకటనలో తెలియజేశారు.