రసాయన అగ్ని ప్రమాదం.. 4గురు మృతి
రాజస్థాన్‌లోని జామ్‌వరంగఢ్‌లో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అగ్నిప్రమాదంలో చనిపోయారు. ఇంట్లోని పలు కెమికల్ డ్రమ్ములు మంటలు చెలరేగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురు పిల్లలు సహా నలుగురు కుటుంబ సభ్యులు సజీవదహనమయ్యారు. గాయపడిన మరో ముగ్గురు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.