Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గాంధీ జంక్షన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

-కలెక్టర్ జె నివాస్, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్

కృష్ణా, జనవరి 30, (నిజం న్యూస్)
బాపూజీ వర్ధంతి రోజున రికార్డుల్లోకెక్కిన 40 అడుగుల జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు, జిల్లా కలెక్టర్ జె నివాస్, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ శంఖుస్థాపన చేసారు. అంతేకాక
నూతనంగా నిర్మించినటువంటి వై.యస్.ఆర్ రైతు బజార్ మరియు ఫ్రూట్ మార్కెట్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
మేము మంచి చేయడానికే వచ్చాం -మంచే చేస్తాం ..నందిగామను అభివృద్ధి చేసి చూపిస్తాం అని తెలిపారు. నందిగామ పట్టణ అభివృద్ధి మాకు అవకాశం కల్పించి, సహకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.గత 30 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని నందిగామ ను ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు హయాంలో నందనవనంగా మార్చారు అని ప్రజలు చెప్పుకునే విధంగా పని చేస్తామని, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో నందిగామను మరింత అభివృద్ధి చేస్తామని, రాజకీయాలను పక్కన పెట్టి దేవినేని వెంకటరమణ, ఎన్టీఆర్ విగ్రహాలను కూడా సముచిత స్థాయిలో గౌరవిస్తూ, వాటిని కాంస్య విగ్రహాలుగా మార్చి నిలబెడతామన్నారు. రాజకీయాలు చేయడానికి రాలేదని, రాజకీయాలు చేయడానికి పని చేయడం లేదని నందిగామ రూపు రేఖలు మార్చి – మొండితోక బ్రదర్స్ అభివృద్ధి చేశారు రా ..అని ప్రజలు కొనియాడెలా పని చేయడానికే వచ్చామని అన్నారు.
ఈ సందర్బంగా విజనరీ లీడర్లుగా పనిచేస్తూ నందిగామ పట్టణం చారిత్రాత్మకంగా నిలిచేలా అభివృద్ధి చేస్తున్నందుకు, ఎండకు ఎండి, వానకు తడిసి పొట్టకూటి కోసం పరితపిస్తున్న చిరు వ్యాపారుల జీవనోపాధి కోసం సకల సదుపాయాలతో ఒక మార్కెట్ ను రూపొందించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించిన ఎమ్మెల్యే కృషిని, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కి, ప్రపంచంలోనే రెండవ స్థానంలో నిలిచిన విగ్రహంగా పేరుగాంచిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ని జిల్లా కలెక్టర్ జె నివాస్ అభినందించారు. అంతేకాక గాంధీ జంక్షన్ అభివృద్ధి పనులకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సి ఎస్ ఆర్ ఫండ్ కింద విరాళం ఇచ్చిన క్రక్స్ బయోటెక్ కంపెనీ, సెంటినీ బయోటెక్ కంపెనీలను అదేవిదంగా నందిగామ నగర పంచాయతీ అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్న మున్సిపల్ కమిషనర్ డాక్టర్ జయరామ్ ,ఏఈ ఫణి శ్రీనివాస్ లను ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభినందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.