కరీంనగర్ లో కారు క్రింద నలుగురు మహిళలు మృతి

కరీంనగర్ పట్టణంలోని కమాన్ ప్రాంతంలో అతివేగంగా వెళ్తున్న కారు రోడ్డు పక్కనే ఉన్న గుడిసె పైకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులను ఫరియాద్, సునీత, లలిత, జ్యోతిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడని, అతివేగానికి కారుపై 9 చలాన్లు ఉన్నాయని తెలిపారు.
మరోవైపు వికారాబాద్ జిల్లా పరిగి మండలం తొండపల్లి శివారులో బైక్‌ను లారీ ఢీకొనడంతో ఆదివారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు కావలి సుభాని, గుర్రంపల్లి కృష్ణయ్యగా గుర్తించారు.