ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీ గా డ్రగ్స్ పట్టివేత

 

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లో మరోసారి భారీ గా డ్రగ్స్ పట్టివేత.

దోహా ప్రయాణికురాలి వద్ద 43.2 కోట్ల విలువ చేసే 3 కేజీల కొకైన్ సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు.

తెల్లటి పౌడర్ రూపంలో కలిగి ఉన్న కొకైన్ ను స్కానింగ్ కు చిక్కకుండా నల్లటి ప్లాస్టిక్ కవర్ లో ప్యాకింగ్ చేసి ట్రాలీ బ్యాగ్ కింది బాగంలో దాచి తరలించే యత్నం చేసిన కిలాడి లేడి.

వెస్ట్ ఆఫ్రికా నుండి దోహా మీదుగా ఢిల్లీ వచ్చిన లేడి కిలాడి పై అనుమానం కలగడం తో అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు.

లేడి కిలాడి ని పలు విధాలుగా ప్రశ్నించిన కస్టమ్స్ బృందం. అధికారుల ముందు నోరు విప్పని లేడి.

దోహా నుండి మోసుకొని వచ్చిన ట్రాలీ బ్యాగ్ ను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు. స్కానింగ్ కు చిక్కకుండా పకడ్బందీగా డ్రగ్స్ దాచిన కిలాడి.

ట్రాలీ బ్యాగ్ పూర్తిగా ధ్వంసం చేసిన అధికారులు. బ్యాగ్ కింది బాగంలో దాచిన కొకైన్ గుట్టును రట్టు చేసిన కస్టమ్స్ అధికారులు.

లేడి కిలాడి పై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అధికారులు.