నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ ఆనంద్ బ్యాగు లో లక్షతో పాటు
నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ ఆనంద్
కల్లూరు బస్ షెల్టర్ లో బ్యాగు మర్చిపోయిన దంపతులు
దొరికిన బ్యాగులో రూ.లక్ష విలువైన నగదు-నగలు
చండ్రుపట్ల గ్రామానికి చెందిన కొత్తపల్లి హరీష్ దంపతులిది గా గుర్తింపు
ఎస్సై వెంకటేష్ సమక్షంలో హరీష్ కుటుంబ సభ్యులకు అందజేసిన ఆనంద్
ఆనంద్ ను అభినందిచిన కల్లూరు మండల,అధికారులు – ప్రజలు
కల్లూరు నిజం న్యూస్:
మండలం పరిధిలో చండ్రుపట్ల గ్రామానికి చెందిన కొత్తపల్లి హరీష్ దంపతులు శనివారం ఉదయం హైదరాబాద్ వెళ్లేందుకు కల్లూరు పట్టణంలో గల బస్ షెల్టర్ లో బస్ కోసం ఎదురుచూస్తున్న క్రమంలో ఒక్కసారిగా వారు వెళ్లే ఈ సి ఐ ఎల్ బస్ ఒక్కసారిగా రావడంతో వారు వెంట తెచ్చుకున్న బ్యాగు మర్చిపోయారు. ఈ క్రమంలో సదరు ప్రయాణికులు హైదరాబాద్ చేరుకున్న తర్వాత వారు లగేజీ చూసుకోవడం తో నగదు ఉన్న బ్యాగు కనపడలేదు. దీనితో బ్యాగు పోయిన విషయం బస్ డ్రైవర్ కు చెప్పడంతో సదరు బస్ డ్రైవర్ కల్లూరు సెంటర్ లో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఆనంద్ కు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన ఆనంద్ బస్ షెల్టర్ లో ఉన్న పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి సదరు ప్రయాణికులు మర్చిపోయిన బ్యాగు ను గుర్తించారు, బ్యాగు తెరిచి చూడగా నగదు, నగలు ఉన్నట్లు గుర్తించి, కల్లూరు ఎస్సై వెంకటేష్ కు సమాచారమిచ్చి సదరు ప్రయానికుని తండ్రి బసవయ్య కు అందజేశారు.బ్యాగు లో ఉన్న నగదు, నగలు మొత్తం రూ.లక్ష వరకు ఉంటుందని ఎస్సై వెంకటేష్ అన్నారు. మరో సారి తన నిజాయితీ ని సాటుకున్న కిన్నెర ఆనంద్ @ ఆర్టీసీ ఆనంద్ ను కల్లూరు మండల అధికారులు మరియు ప్రజలు అభినందించారు. ఇటీవలే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం డీవిజనల్ మేనేజర్ సుగుణాకర్ రావు చేతుల మీద ఆర్టీసీ నేస్తం అవార్డు అందుకున్న విషయం మండల ప్రజలకు తెలిసిందే.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది దాసరి వెంకటేశ్వరరావు, మరకాల రత్నాకర్, జినుగు నాగరాజు, మరియు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.