పేద బాలికలకు సైకిళ్లు పంపిణీ
నేరేడుచర్ల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం నేరేడుచర్ల మునిసిపాలిటీ గా ఆవిర్భవించి, మున్సిపాలిటీ తొలి మున్సిపల్ వైస్ చైర్మన్ గా చల్లా శ్రీలత రెడ్డి ఎన్నుకోబడి,నేటికీ రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా బడికి వెళ్లే పేద బాలికలకు చల్లా శ్రీలత రెడ్డి 25 వేల రూపాయల విలువ గల సైకిళ్లు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ బాగా చదువుకోవాలని బాలికలను ప్రోత్సహించి, కార్యాలయంలో స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి చిత్తలూరి సైదులు, వల్లంశెట్ల రమేష్ బాబు, కౌన్సిలర్ ఎస్కే.భాష, గ్రంధాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ, వేమూరి నారాయణ, ఇంజమూరి రాములు, బుడిగె చంద్రయ్య గౌడ్, యూత్ అధ్యక్షుడు పోకబత్తిని రాజేష్, ఇంజమూరి రాజేష్, మల్గిరెడ్డి రామి రెడ్డి, కొమర్రాజు నరేష్, కొమర్రాజు వెంకట్, శ్రీకాంత్,పుల్లయ్య,రియాజ్, మహేష్,నాగరాజు, సామేల్ తదితరులు పాల్గొన్నారు.