ఎస్సారెస్పీ చిన్న కాలువకు గండి

మానాపురం గిరిజన రైతుల గగ్గోలు.

గండికి మరమ్మతులు నిర్వహించి, నష్టపరిహారం అందించాలని రైతుల వేడుకోలు.

తుంగతుర్తి మండల పరిధిలోని మానాపురం గ్రామములో ఎస్ ఆర్ ఎస్ పి69 డి బి ఎం నుండి నీటి ప్రభావం అధికం కావడంతో, గ్రామంలో ఉన్న చిన్న కాలువ గండి పడటంతో, భారీగా వరద నీటితో, రైతుల పొలాల మీదుగా ప్రవాహం సాగుతుండడంతో, రైతుల వరి పంటకు నష్టం వాటిల్లినట్టు గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఎస్సారెస్పీ కాలువ సంబంధిత ఉన్నతాధికారులు, చొరవచూపి, యుద్ధప్రాతిపదికపై గండి ని మరమ్మతులు చేసే దిశగా చర్యలు తీసుకొని, బాధిత గిరిజన రైతులకు నష్టపరిహారం, అందించాలని, గిరిజన రైతులు కోరుతున్నారు