మద్యం షాపులలో చోరీలకు పాల్పడిన ఇద్దరి పై పిడియాక్ట్
మద్యం షాపుల లో చోరీలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులపై పిడియాక్ట్
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం షాపుల తో పాటు కిరాణా షాపులో చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులపై పీడీ యాక్ట్ ఉత్తర్వులను జారీచేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్స్టేషన్లలో పరిధిలో తాళం వేసి ఉన్న మద్యం దుకాణాల తో పాటు కిరణ్ షాప్ లో చోరీలకు పాల్పడిన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గ్రామం హేమ (40) మోహన్(42) నిందితులపై వరంగల్ పోలీస్ కమిషనర్ జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర పీడీ యాక్ట్ ఉత్తర్వులను కారాగారం అందజేశాడు. పీడీ యాక్ట్ అందుకున్న నిందితులతో పాటు మరో ఇద్దరు కలిసి పగటి సమయాలలో గ్రామ శివారు ప్రాంతాలలో ఉండే మద్యం షాపులను గుర్తించి రాత్రి సమయాలలో నిందితులు మద్యం షాపు షట్టర్ తాళాలు పగులగొట్టి షాపులోనే మద్యం సీసాలతో పాటు క్యాష్ కౌంటర్ లోని డబ్బును చోరికి పాల్పడిన సంఘటన నిందితులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించడం జరిగింది. నిందితులు గతంలో 14 చోరీలకు పాల్పడ్డారు ఇందులో సిద్దిపేట జిల్లాలో రెండు దుకాణాలు ఒక వైన్ షాప్ ఒక కిరణం షాప్ కలుపుకుని మొత్తం నాలుగు చోరీలకు పాల్పడగా సంగెం పరిధిలో రెండు అయినవోలు, రఘునాథపల్లి, దుగ్గొండి, వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లలో పరిధిలో ఒకటి చొప్పున వైన్ షాప్ లో నగదు మద్యం సీసాలను చోరీలకు పాల్పడిన డంతో నిందితులపై పీడీ యాక్ట్ ఉత్తర్వులను జారీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల ఆస్తులను చోరీలకు పాల్పడిన సహించేది లేదని అలాగే వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయబడి వరంగల్ పోలీస్ కమిషనరేట్ తెలియజేశారు.