Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వినియోగదారులను మోసగిస్తున్న ‘శుభ నందిని

*వినియోగదారులను మోసగిస్తున్న ‘శుభ నందిని’*

*- చిట్టి కాలపరిమితి ముగిసినా ఇవ్వకుండా కాలయాపన*

*- వినియోగదారుల కేంద్రంను ఆశ్రయించిన మడిపల్లి వాసి*

మహబూబాబాద్ :

రూపాయి రూపాయి కూడబెట్టుకున్న సొమ్మును డిపాజిటర్లకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న స్థానిక శుభ నందిని చిట్ పండ్ సంస్థ పై చర్యలు తీసుకోవాలని బాధితుడు జిల్లా వినియోగదారుల కేంద్రంను ఆశ్రయించాడు.

చిట్టి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న శుభ నందిని చిట్ పండ్ నిర్వాహకుల పై చర్య తీసుకోవాలని కోరుతూ మండలంలోని మడిపల్లి గ్రామ వాసి చల్లా బాబు రెడ్డి శుక్రవారం డివిజన్ కేంద్రంలో జిల్లా వినియోగదారుల కేంద్రం ఇంచార్జ్ డాక్టర్ వింజమూరి సుధాకర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళితే….

మండలంలోని మడిపల్లి వాసి బాబు రెడ్డి తొర్రూరులోని శుభ నందిని చిట్ ఫండ్ సంస్థలో ఎస్టీఆర్టీ 01పీ- 24 పేర 10 లక్షల చిట్టి వేశాడు. 48 నెలల పాటు నెలకు రూ.20 వేల చొప్పున సంస్థలో బాబు రెడ్డి జమ చేశాడు. సదరు చిట్టి కాలపరిమితి 2018 లోనే పూర్తయినప్పటికీ చిట్టి జమ మొత్తం ఇవ్వకుండా ఇదేమని ప్రశ్నిస్తే సంస్థ లెటర్ ప్యాడ్ పై రాసి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. చిట్టి డబ్బుల పై పలుమార్లు శుభ నందిని నిర్వాహకులకు మొరపెట్టుకున్నా ఇవ్వకపోవడంతో విసుగు చెందిన బాధితుడు వినియోగదారుల కేంద్రంను ఆశ్రయించాడు.

వినియోగదారుల కేంద్రం ఇంచార్జ్ వింజమూరి సుధాకర్ మాట్లాడుతూ

చిట్టీల కాల పరిమితి ముగిసినా డబ్బులివ్వక ఇబ్బందులకు గురి చేస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. డిపాజిటర్ల డబ్బులతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ, చిట్టీ గడువు ముగిసిన తర్వాత డబ్బు అడిగిన వారిని పదేపదే తిప్పించుకోవడం సరికాదన్నారు. నెల వారీగా చెల్లించిన డబ్బు ఒక్కసారి పెద్ద మొత్తంలో వస్తుందనే ఉద్దేశంతో చిట్టీలు వేస్తుంటారని, రిజిస్ట్రేషన్‌ శాఖ అనుమతితో చిట్టీలు నడుపుతున్నామని చెప్పి పలు సంస్థలు మోసగిస్తే చర్యలు తప్పవన్నారు.