అన్నాలయంగా పేరొందిన మట్టపల్లి క్షేత్రం

– తెలుగు రాష్ట్రాలలో శ్రీశైలం తర్వాత అన్నదాన సత్రాలున్న క్షేత్రం మట్టపల్లి క్షేత్రమే
-స్వామి వారి వద్ద ఉన్న శంఖాలు దక్షిణాదిముఖంగా ఉండటమే కారణమంటున్న భక్తులు
-కృష్ణాపుష్కరాలకు లక్ష మందికి పైగా భక్తులకు అన్నదానం పెట్టడానికి సత్రాల సన్నాహాలు
-బ్రహ్మణ , ఆర్యవైశ్య , కమ్మ , రెడ్డి , విశ్వబ్రహ్మణుల సత్రాల్లో నిత్య అన్నదానం
-భక్తులు సేదతీరడానికి 17 సత్రాలల్లో 150 వరకు గదులు
-తొలిఏకాదశి , కార్తీకపౌర్ణమి , ముక్కొటి , స్వామివారి కళ్యాణాలకు అన్నదానాలను నిర్వహిస్తున్న సత్రాలు
-17 అన్నదాన సత్రాలకు ఉచితంగా స్థలాలిచ్చిన దేవస్థాన కమిటీ
చంలోని ఏ దేశంలో ఉన్న ఆలయాల్లోనైనా దేవుని వద్ద ఉన్న శంఖాలు ఉత్తర ముఖంగా ఉంటాయి . కాని మట్టపల్లి లక్ష్మీనృసింహాస్వామి దేవాలయం శంఖాలు మాత్రం దక్షిణ ముఖంగా ఉన్నాయి . ఈ శంఖం ఇలా ఉండటం వల్లనే ఈ క్షేత్రంలో అన్నదానం విరివిగా జరుగుతుంది . దీంతో ఈ స్వామికి మిగా పేరొచ్చిందని భక్తులు తెలుపుతుంటారు . ఈ స్వామికి ప్రీతిపాత్రమైనది అన్నదానం . ఈ ఆలయంలో ప్రతినిత్యం అన్నం నిల్వ ఉంటుందని ప్రతీతి . లం తర్వాత అత్యధికంగా అన్నదాన సత్రాలున్నది మట్టపల్లి క్షేత్రమేనంటే ఆశ్చర్యం కలుగకమానదు . కృష్ణా పుష్కరాలకు రోజుకు 10 లక్షల మంది పుణ్య కరించే అవకాశం ఉన్న మట్టపల్లి క్షేత్రంలో లక్ష మందికి పైగా భక్తులకు ప్రతీరోజూ అన్నదానంను చేయడానికి సత్రాలు సిద్దమవుతున్నాయి . ఈ సత్రాలలో లు సేద తీరడానికి 17 సత్రాలలో 150 కి పైగా గదులు , వరండాలు ఉన్నాయి . దేవస్థానం కూడా ఈ మధ్యనే నిత్య అన్నదానంను ప్రవేశపెట్టింది . వారం ండి శుక్రవారం వరకు పదుల సంఖ్యలో శనివారం నాడు వందల సంఖ్యలో దేవస్థానం ఆధ్వర్యంలోని భోజనశాలలో భక్తులు భోజనాలను చేస్తున్నారు . పుష్కరాల సమయం లో తెలంగాణ ప్రభుత్వం దేవస్థానం తరుపున ప్రతీ రోజూ 10 వేల మంది భక్తులకు అన్నదానం చేయాలని సంకల్పించింది .
లక్ష మంది భక్తులు సేద తీరే అవకాశం …..
పవిత్ర కృష్ణానదీ తీరంలో భక్తులు పుణ్యస్నానాలను ఆచరించి , స్వామి వారి దర్శనం చేసుకున్న భక్తులు ఆకలితో ఇబ్బంది పడకుండా ఉండటానికి ఆర్యవైశ్య , బట్రాజులు , విశ్వబ్రహ్మణులు , యాదవులు , గౌడలు , కాకతీయ కమ్మ , రెడ్లు , పద్మశాలీలు , నాయీబ్రహ్మణులు , ముదిరాజులు , శాలివాహనులు , మన్నూరుకాపు జలగిరి. క్షత్రియ ( పెరిక ) , మాల ( హిందూ ) , భంజారా , ముక్కూరి లక్ష్మినరసింహాస్వామి సత్రాలున్నాయి . ఈ 17 సత్రాలు తో కళ్యాణం వంటి పండుగ సమయాల్లో అన్నదానంలను నిర్వహిస్తున్నారు . బ్రహ్మణ , ఆర్యవైశ్య , కమ్మ , రెడ్డి , విశ్వబ్రహ్మణుల అన్నదానంను నిర్వహిస్తున్నారు..ఈ 17 అన్నదాన సత్రాలకు దేవస్థాన కమిటీ ఉచితంగా స్థలాలను అందజేసారు .
పులిచింతల ప్రాజెక్టు కట్టే సమయములో ఈ దేవాలయం మునిగిపోయే ప్రమాదం ఉండటం , దేవాలయం స్వయంభుదేవాలయం కావడంతో తరలించే అవకాశం లేదు . దేవాలయ రక్షణ కోసం రూ . 6 కోట్లతో సుమారు 600 మీటర్ల పొడవున కరకట్టలను నిర్మించారు.
తమిళనాడులోని చెన్నైలో శతాధికయజ్ఞకర్త శ్రీమాన్ ముక్కూర్ నృసింహాచార్మర్ మట్టపల్లి నెలకొల్పాడు . ఏటా అక్కడి నుండి వేలాది మంది భక్తులు ఈ క్షేత్ర దర్శనానికి వస్తుంటారు . చెన్నై నుండి వచ్చే భక్తులకు కోసం భోజనసదుపాయాన్ని కల్పించడం విశేషం .
ఆర్యవైశ్య అన్నదాన సత్రం
-1958 లో ప్రారంభించారు .
-భక్తులు సేదతీరడానికి 63 గదులు , వరండాలున్నాయి .
-1989 నుండి నేటి వరకు నిత్య అన్నదానంను నిర్వహిస్తున్నారు .
-2004 పుష్కరాలకు 4 వేల మందికి భోజనాలు
– ఈ సారి 10 వేల మందికి పైగా పెట్టే అవకాశం
బ్రహ్మణ అన్నదాన సత్రం ..
-1959 లో ప్రారంభం
-18 గదులు , వరండాలున్నాయి .
1988 నుండి నేటి వరకు నిత్య అన్నదానం గత పుష్కరాలకు 70 వేల మందికి భోజనాలు
-ఈ సారి పుష్కరాలకు లక్షకు మందికి పైనే భోజనాల ఏర్పాటు
విశ్వబ్రహ్మణ అన్నదాన సత్రం …
1994 లో ప్రారంభం -12 గదులు , వరండాలున్నాయి .
-2000 నుండి నిత్య అన్నదానంను నేటి వరకు చేస్తున్నారు .
గత పుష్కరాలకు 20 వేల మందికి అన్నదానం ఈ పుష్కరాలకు 50 వేల మందికి అన్నదానంనకు ఏర్పాట్లు
రెడ్డి అన్నదాన సత్రం :
-2000 లో ప్రారంభం -14 గదులు , వరండాలున్నాయి
-2009 నుండి నిత్య అన్నదానంను నిర్వహిస్తున్నారు .
గత పుష్కరాలకు 3 వేల మందికి అన్నదానం ఈ పుష్కరాలకు 20 వేల మందికి ఏర్పాటు
కమ్మ అన్నదాన సత్రంః
-1994 లో ప్రారంభం 12 CO – సత్రాలలో 19 గదులు , వరండాలున్నాయి
-1996 లో రైతు అన్నదాన సత్రం పేరుతో నిత్య అన్నదానం ,
2001 నుండి నిత్య అన్నదాన సత్రంగా మార్పు గత పుష్యరాలలో 10 వేల మందికి భోజన సదుపాయం
ఈ పుష్కరాలలో 50 వేల నుండి 60 వేల మందికి అన్నదానంనకై ఏర్పాట్లు
మద్రాస్ అన్నదాన సత్రం :
-1984 లో ప్రారంభం -8 గదులు , వరండాలున్నాయి
-2013 జూన్ నుండి నిత్య అన్నదానం ,
గత పుష్కరాలకు 2 వేల మందికి అన్నదానం ఈ పుష్కరాలకు 3 వేల నుండి 5 వేల మందికి అన్నదానంకు ఏర్పాట్లు . వాలెంటీర్లు అందుబాటులో ఉంచారు .
పద్మశాలి అన్నదాన సత్రం :
2010 లో ప్రారంభం 3 గదులు , వరండాలున్నాయి .
– తొలిఏకాదశి , కార్తీక పౌర్ణమి , ముక్కోటి ఏకాదశి , స్వామివారి కళ్యాణం వంటి పండుగ సమయాల్లో అన్నదానం
గత పుష్కరాల్లో 5 వేల మందికి అన్నదానం
– ఈ పుష్కరాల్లో రోజుకు 1000 మందికి అన్నదానంనకు ఏర్పాట్లు
ముదిరాజ్ అన్నదాన సత్రం
-2007 లో ప్రారంభం -6 గదులు , వరండాలున్నాయి .
– తొలిఏకాదశి , కార్తీక పౌర్ణమి , ముక్కోటి ఏకాదశి , స్వామివారి కళ్యాణం వంటి పండుగ సమయాల్లో అన్నదానం
– ఈ పుష్కరాల్లో రోజుకు 2000 మందికి అన్నదానం చేయడానికి ఏర్పాట్లు
గౌడ అన్నదాన సత్రంః
2001 లో ప్రారంభం -6 గదులు , వరండాలున్నాయి
. -తొలిఏకాదశి , కార్తీక పౌర్ణమి , ముక్కోటి ఏకాదశి , స్వామివారి కళ్యాణం వంటి పండుగ సమయాల్లో అన్నదానం -2004 పుష్కరాల్లో 20 వేల మందికి అన్నదానం
– ఇప్పుడు 30 వేల మంది అన్నదానం చేయడానికి ఏర్పాట్లు
యాదవ అన్నదాన సత్రం
-1991 లో ప్రారంభం -4 గదులు , వరండాలున్నాయి .
-తొలిఏకాదశి , కార్తీక పౌర్ణమి , ముక్కోటి ఏకాదశి , స్వామివారి కళ్యాణం వంటి పండుగ సమయాల్లో అన్ని కులాల వారికి అన్నదానం
గత పుష్కరాలకు రోజుకు 2 వేల మందికి అన్నదానం ఈ పుష్కరాలకు రోజుకు 4 వేల మందికి అన్నదానం చేయడానికి ఏర్పాట్లు
మున్నూరుకాపు అన్నదాన సత్రం :
-1999 లో ప్రారంభం -12 గదులు , వరండాలున్నాయి .
-తొలిఏకాదశి , కార్తీక పౌర్ణమి , ముక్కోటి ఏకాదశి , స్వామివారి కళ్యాణం వంటి పండుగ సమయాల్లో అన్ని కులాల -గత పుష్కరాల్లో 10 వేల మందికి అన్నదానం
– ఈ పుష్కరాల్లో 30 వేల మందికి అన్నదానంనకు ఏర్పాట్లు ‘
బట్రాజుల అన్నదాన సత్రం :
2015 లో ప్రారంభం -8 గదులు , వరండాలున్నాయి
-తొలిఏకాదశి , కార్తీకపౌర్ణమి , ముక్కోటి ఏకాదశి , స్వామివారి కళ్యాణం వంటి పండుగ సమయాల్లో అన్ని కులాల వారి గత పుష్కరాలకు 10 వేల మందికి అన్నదానం
-పుష్కరాలకు రోజుకు 3 వేల మందికి అన్నదానంనకు ఏర్పాట్లు
రజక అన్నదాన సత్రం
2018 లో ప్రారంభం -6 గదులు నిర్మాణ దశలో ఉన్నాయి .
-5 నుండి 6 వేల మందికి అన్నదానంనకై ఏర్పాట్లు
నాయీ బ్రహ్మణుల అన్నదాన సత్రం
-2010 లో ప్రారంభం -3 గదులు , వరండాలున్నాయి .
.-గతంలో రోజుకు 10000 మందికి భోజన వసతి ఈ పుష్కరాలకు రోజుకు 1000 మందికి భోజన వసతి కల్పించడానికి ఏర్పాట్లు
ఇవేగాక మాల ( హిందూ ) , వడ్డెర అన్నదాన సత్రం , క్షత్రియ , ఖమ్మంపాడు గ్రామభక్తుల అన్నదాన సత్రం , బంజారా అన్నదాన సత్రాలలో ముక్కోటి ఏకాదశి , నరసింహా స్వామివారి కళ్యాణం వంటి పండుగ సమయాల్లో అన్ని కులాల వారికి అన్నదానంను నిర్వహిస్తున్నారు .