మట్టపల్లి నృసింహునికి వెయ్యేళ్ల చరిత్ర

– స్వయంభువుడు మట్టపల్లి నృసింహుడు
– నదీతీరాన ఉన్న పంచనారసింహాక్షేత్రాల్లో మట్టపల్లి ఒకటి
హుజూర్ నగర్ నియోజకవర్గంనకు 25 కిలో మీటర్ల దూరంలో కృష్ణానదీ తీరాన ఉన్న శ్రీ మట్టపల్లి నృసింహాక్షేత్రం భక్త కోటి జనసందోహంతో నిరంతరం కిటకిటలాడుతూ నృసింహనామ భజనలచేత అలరాడుతున్నది .
పూర్వం కాలంలో అరణ్యమయమై ప్రయాణ సౌకర్యం లేకపోయినా దేవుని చూడాలన్న కోరికతో భక్తులు కాలినడకన , బండ్ల మీద వచ్చి స్వామిని దర్శించుకునేవారు . అటువంటి సమయంలో కేశవతీర్థ యతేంద్రుడు అక్కడ ఆశ్రమ నిర్మాణం చేసుకొని సుమారు 20 సంవత్సరాల నృసింహో పాసనం చేసి తరించిన ఆయన కాలంలో దేవాలయం అభివృద్ధికి పునాదులు వేయబడ్డాయి . .
భరధ్వాజాది మహార్షుల తపోభూమిగా ప్రసిద్ధి చెందిన మట్టపల్లి క్షేత్రం కృష్ణానదీ పరివాహక ప్రాంతంలోని పంచనారసింహా క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతోంది . భక్తుల కొంగుబంగారమై వెలుగొందుతున్న ఈ ఆలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది . ఇక్కడి కృష్ణా నదిలో మహర్షులు స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకునేందుకు గుహ మార్గాన వచ్చి నృసింహుని దర్శించుకునేవారని ప్రతీతి .
గర్భాలయంలో నేటికీ గుహమార్గం కనిపించడం విశేషం . 11 వ శతాబ్ధంలో ఇక్కడ స్వయంభువుడై వెలిసిన యోగానంద నారసింహుని శిరస్సుపై ఆదిశేషుడు సహస్ర పడగలతో గోచరిస్తాడు . ఆలయంలోని ధ్వజస్థంభం చుట్టూ 32 ప్రదక్షిణలు చేసే వారికి కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు .
స్వామి వారి గొప్పతనాన్ని దేశానికి చాటిన ముక్కూరి నృసింహాచార్యులు …..
1990 సంవత్సరంలో అహోబిల నృసింహుని ఆశ్రమ వాసులు సంస్కృత మహా పండితుడు నెల్లూరు నివాసులైన ముక్కూరి నృసింహాచార్యులు , నృసింహా మహామంత్రం మహిమచేత సిద్ధి పొంది , ఆసేతు హిమాచల పర్యంతం గల దివ్యక్షేత్రముల యందు శ్రీ లక్ష్మీనృసింహా మహాయజ్ఞాలు ( స్వాతి నక్షత్రయ్యం ) 108 యజ్ఞాలుగా చేయుచూ 3 మట్టపల్లి నృసింహ క్షేత్రమునకు వచ్చి ఇచ్చట 1992 , 104 యజ్ఞం చేశాడు . వారి అనుస్థాన మహి వలన క్షేత్రం అత్యంత తపో మహిమాన్విత శక్తిగలదై విరాజిల్లుతూ జిల్లా , రాష్ట్రం , దేశం నలుమూల ఆలయ ప్రాచుర్యం విస్తరించింది .
ఆలయ చరిత్ర తెలుసుకొని పూర్వ కాలంలో మునులు తపస్సు చేసిన ప్రాంతం ఇదని , దేశంలోని నృసింహా ఆలయాలలో ప్రత్యేక స్థానం ఉందని గ్రహించి యజ్ఞశాలను నిర్మించాలని అప్పుడే తలంచారు . 2000 సం || రం వరకు స్వాతి నక్షత్ర యజ్ఞాలను నిర్వహించి మట్టపల్లి చరిత్ర దేశం నలుమూల వ్యాపింప చేశాడు .
అనంతరం ఆయన వారసులైన శ్రీనివాసన్ ఆధ్వర్యంలో మట్టపల్లిలో నృసింహాచార్మర్ , ట్రస్టు ఏర్పాటు చేసి 32 గదులతో అతిథి గృహాలను నిర్మించి , ఎందరో భక్తులకు ఆశ్రయమిస్తున్నారు . ప్రతి యేట ఈ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగే తిరు నక్షత్ర కళ్యాణ ఉత్సవాలకు తమిళనాడు , చెన్నై , బెంగుళూరుకు చెందిన భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు .
నెలనెల తమిళనాడు నుండి వచ్చే భక్తుల సంఖ్య అధికంగానే ఉంటుంది . చెన్నైలో నృసింహుని పీతం … | తమిళనాడులోని చెన్నైలో శతాధికయజ్ఞకర్త శ్రీమాన్ ముక్కూర్ నృసింహాచార్మర్ మట్టపల్లి నృసింహస్వామి పీఠాన్ని 1995 లో నెలకొల్పాడు .
ఏటా అక్కడి నుండి వేలాది మంది భక్తులు ఈ క్షేత్ర దర్శనానికి వస్తుంటారు . స్వాతీనారసింహా మహాయజ్ఞ ట్రస్టును ఇక్కడ స్థాపించి రూ . 1.50 కోట్లతో యజ్ఞవాటికను నిర్మిస్తున్నారు . స్వామికి ప్రీతిపాత్రమైన 32 శ్లోకాలు , ప్రదక్షిణల ప్రాశస్త్యాన్ని తెలిపేలా క్షేత్రంలో 82 స్థంభాలు , 32 భవనాలతో వాటిక నిర్మితమవుతోంది . ఆలయం అభివృద్ధి చెందడంతో పాటు ఆధునిక వసతులను సమకూరుస్తున్నారు .
అన్నదాన ప్రియుడు ఈ స్వామి …..
నృసింహుని క్షేత్రంలో నిరంతరం అన్నదానం జరగడం విశేషం . ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం తరువాత , తెలంగాణలోని మట్టపల్లిలోనే అధిక సంఖ్యలో సత్రాలున్నాయి . సామాజిక వర్గాల వారీగా ఇక్కడ 13 శాశ్వత భవనాల్లో సత్రాలు నిర్వహిస్తున్నారు . స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే వివిధ కులాల వారికి వారి సత్రాలలో అన్నదానంతో పాటు అకామిడేషను కూడా ఇస్తున్నారు . అన్నదాన సత్రాలలో రోజుకు లక్ష మందికి పైగానే అన్నదానంను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసారు .